చెక్ పోస్ట్ ను సందర్శించిన వరంగల్ సి పి సన్ ప్రీత్ సింగ్
ఖానాపురం డిసెంబర్ 2 ( నమస్తే భారత్ ) :
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో వరంగల్ జిల్లా సరిహద్ధు ఖానాపురం మండలంలోని వేప చెట్టు తండా చెక్ పోస్ట్ ను వరంగల్ సి పి సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి ,శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ అధికారులకు కీలక సూచనలు సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు, ప్రజలు ఎలాంటి వక్రీ లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి వివాదాలు, అశాంతి వాతావరణం నెలకొనకుండా పోలీస్ బందోబస్తు ను పెంచాలని సూచించారు. అధికారులతో సమన్వయంగా కలిసి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సి పి సన్ ప్రీత్ సింగ్, ఈస్ట్ జోన్ డిసిపి బి రాజేంద్ర నాయక్ , నర్సంపేట ఏసీపి పి రవీందర్ రెడ్డి , దుగ్గొండి సీఐ ఎం సాయి రమణ, ఖానాపురం ఎస్ఐ సిహెచ్ రఘుపతి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
