ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వాలు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ డిసెంబర్ 4 ( నమస్తే భారత్ ) :
గత ఎన్నికల్లో ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో విస్మరిస్తున్న ప్రభుత్వాల విధానాలను పోరాటాలతోనే బుద్ధి చెప్పాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. వరంగల్ లోని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన యువకులు చుక్క ప్రశాంత్ నాయకత్వంలో ఎంసిపిఐ(యు) ప్రజా సంఘాల్లో చేరిన సందర్భంగా వారికి ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జన్ను రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మౌలిక సదుపాయాల కల్పనకై పని చేయాల్సింది పోయి అవినీతి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ అధికారమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ క్రమంలో శ్రమజీవులంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ తరగతుల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాన్ని ఏకైక శరణ్యమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల హామీలను విస్మరించిన పాలక పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. నీతి నిజాయితీ రాజకీయ విలువల స్థాపన కోసం ఎం సి పి ఐ (యు) పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కోరారు.
పార్టీ ప్రజా సంఘాల్లో చేరిన వారిలో చుక్క ప్రశాంతతో పాటు ఇస్లావత్ కళ్యాణ్ జిల్లా మహేష్ కుమార్ గౌరీ రాజ్ కుమార్ బానోతు నితిన్ భానోత్ జగన్ దిడ్డి విష్ణు దినేష్ సాయి కృష్ణ పవన్ సన్నీ రాకేష్ బిందు సాయిరాం అజయ్ కుమార్ వినయ్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వద్ద సభ్యులు గోనె కుమారస్వామి నర్రా ప్రతాప్ కన్నం వెంకన్న మంద రవి కుసుంబ బాబూరావు మాలోత్ సాగర్ సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి వంగల రాగసుద కనకం సంధ్య విద్యార్థి నాయకులు జన్ను రమేష్ మార్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
