మహేశ్వరం మండలంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటాం. 

On
మహేశ్వరం మండలంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటాం. 

 

నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందెల శ్రీరాములు యాదవ్.

మహేశ్వరం, డిసెంబర్ 1, నమస్తే భారత్ న్యూస్ ప్రతినిధి:

 మహేశ్వరం మండలం మొహబ్బత్ నగర్ గ్రామంలోని కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్ పార్టీల నాయకులు మండల బిజెపి అధ్యక్షులు యాదీష్ ఆధ్వర్యంలో  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్  సమన్వయంతో సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బిజెపి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో కేతావత్ రవి నాయక్   వారి సహచరులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరాములు వారికి బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అందెల శ్రీరాములు  మాట్లాడుతూ.. మహేశ్వరం మండలంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు రామ్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, తుమ్మటి కృష్ణ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, కొర చక్రు, కొర బాబుల నాయక్, లాలూ నాయక్, ఆంజనేయులు, దేవేందర్ శేఖర్, శ్రీకాంత్, శ్రీనాథ్, అనిల్, ప్రవీణ్, నరేందర్, కుమార్, శివ, బన్నీ, విజయ్, శ్రీధర్, భాస్కర్, చిన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise