స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి సిద్ధం
మద్యం, డబ్బు, బిర్యానీలు, నా నుంచి ఆశించకండి.
ఏఐఎస్ఎఫ్ యువ నేత ఆకాష్ నాయక్ స్పష్టం
నమస్తే భారత్ షాద్ నగర్ నవం27:జిల్లేడు చౌదర్‌గూడా మండలంలోని చింతకుంట తండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏఐఎస్ఎఫ్ యువ నేత ఆకాష్ నాయక్ ముందుకు వచ్చారు. ప్రజాసేవను లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.ఎన్నికల ప్రచార ప్రక్రియలో ప్రజలతో మాట్లాడిన ఆకాష్ నాయక్ మాట్లాడుతూ...ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు, బిర్యానీలు, ఇతర సౌకర్యాలు నా ద్వారా ఎవ్వరూ ఆశించవద్దు. నేను కొనుగోలు ఓట్లకు వ్యతిరేకం. మీ సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కోసం నిజాయితీతో పని చేయడం నా ధ్యేయం అని స్పష్టం చేశారు.ప్రజల సమస్యలు పరిష్కరించడంలో 100% రాజీలేని పోరాటం చేస్తాను. చెడు వ్యసనాలకు బానిసలు చేసే రాజకీయాలు నాకు దూరం. అభివృద్ధి చేసేదే నాయకుడు, ప్రజల పక్షాన నిలబడేదే నాయకుడు. అలాంటి నాయకుని ఎన్నుకునే బాధ్యత ఓటర్లదే అని అన్నారు.ఆకాష్ నాయక్ తన ప్రచారంలో యువత, మహిళలు, రైతులతో భేటీ అవుతూ గ్రామ స్థాయి సమస్యలను తెలుసుకుంటూ నడుస్తున్నారు.ప్రజలకు చేరువ అవుతూ అభివృద్ధి పట్ల తన దృక్పథాన్ని తెలియజేస్తున్నారు.అలాగే ప్రజలను విజ్ఞప్తి చేస్తూ...మీ ఓటును అమ్ముకోవద్దు. ఓటు అంటే బాధ్యత. మీ ఓటును అమ్మితే భవిష్యత్తు అంధకారంలోకి నెట్టినట్టే. సమాజం పట్ల అవగాహన, అభ్యుదయ భావాలు ఉన్న నాయకులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
