జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో గీతాంజలి స్కూల్   ప్రతిభ 

On
జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో గీతాంజలి స్కూల్   ప్రతిభ 

 


నర్సంపేట నవంబర్ 29 ( నమస్తే భారత్  )  :  


జిల్లా స్థాయిలో జరిగిన బాల వైజ్ఞానిక ప్రదర్శనలో గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కే అభిజ్ఞ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు అనే అంశంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ  బహుమతి సాధించింది. ఈ సందర్భంగా గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు  మాట్లాడుతూ రాయిని కరిగిస్తే వజ్రం కనిపిస్తుంది దానికి సాన పెడితేనే విలువ పెరుగుతుంది అనే విధంగా విద్యార్థుల యొక్క అభిరుచిని గుర్తించి అటువైపు వారిని మళ్లించడమే గురువుల యొక్క లక్ష్యం అని అన్నారు.
పాఠశాల అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాదు పుస్తకాలను దాటి విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే ప్రయత్నంలో గీతాంజలి విద్యాసంస్థ ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.రాజేష్  మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న సమాజంలో ఎప్పుడూ అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటికి ఎదురెళ్లి సాధించగల ప్రతిభ ఉన్న విద్యార్థులు వారి గమ్యాలను చేరుకోవాలన్నారు.ఇదేవిధంగా కష్టపడి ఉన్నత శిఖరాలు సాధించాలని తెలియజేశారు. బహుమతి సాధించిన విద్యార్థినిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు.

Tags

Share On Social Media

Latest News

Advertise