బిఆర్ ఎస్ లో బోటిమిది తండా మాజీ సర్పంచ్ చేరిక
ఖానాపురం డిసెంబర్ 1 ( నమస్తే భారత్ ) :
ఖానాపురం మండలం బోటిమిది తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గుగులోత్ తారమ్మా మరియు గుగులోతు కిషన్ నాయక్ తో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు .గుగులోతు కిషన్ నాయక్ తో పాటు బాధవత్ రవి నాయక్,బానోతు లచ్చిరాం,గుగులోతు లింబా,గుగులోతు సమ్య,బానోతు సదర్ లాల్,గుగులోతు హాచ్య మూడు మంగమ్మ,బానోతు చాంది, గుగులోతు సంతోష్,బానోతు నరేష్, గుగులోతు రాజు,గుగులోతు సురేష్,బానోతు మాలమ్మ, బానోతు యకమ్మ తదితరులు చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
