స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ను త్వరగా చేయాలి
జిల్లా ఎన్నికల అధికారి / జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు నవంబర్ 26(నమస్తే భారత్):
జిల్లాలో ఎస్ ఐ ఆర్ 2026 ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి / జిల్లా కలెక్టర్ ఏ.సిరి అధికారులను శిక్షణా కార్యక్రమంలో ఆదేశించారు.
బుధవారం సాయంకాలం ఈఆర్వోలు , ఏఈఆర్వోలు , ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారుల కు చెందిన ఎస్ ఐ ఆర్ - 2026 శిక్షణ కార్యక్రమము ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి / జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ ప్రక్రియలో వెనుకబడి ఉన్నందున అధికారులందరూ బి ఎల్ఓ లు మరియు బిఎల్ ఏ ల సహకారంతో ప్రక్రియను వేగవంతంగా చేయాలని ఆదేశించారు.
2002 లో చివరిసారిగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందని ఇప్పటికీ 22 సంవత్సరాలు పూర్తి అయినదని కావున కేంద్ర ఎన్నికల సంఘం మరొకసారి ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం జరిగిందని తెలిపారు. 2002 ఎలెక్టోరల్ రోల్ ప్రకారం ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎలక్ట్రోల్ రోల్ తో ఓటర్లను మ్యాపింగ్ చేసుకోవాలని ఇందుకోసం బిఎల్ఓ ప్రతి ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్లి నిర్ణీత ఫారంలలో ఓటర్ వివరాలు సేకరించుకోవాలని ఆ తర్వాతనే డ్రాఫ్ట్ రోల్ లో పేర్లు ఉంచాలని తెలిపారు. మరణించిన ఓటర్ వివరాలు మరియు అందుబాటులో లేని ఓటర్ల వివరాలు నిర్ణీత ఫారాల లో సేకరించుకొని నోటీసులు అందజేసి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ , డి ఆర్వో వెంకట నారాయణమ్మ , జిల్లా పరిషత్ సీఈవో నాసరరెడ్డి , కర్నూలు మున్సిపల్ కమిషనర్. విశ్వనాథ్ ,.. జిల్లా ఎన్నికల విభాగం చూపెట్టెంట్ మురళి ఈ ఆర్వో లు, ఏఈఆర్వోలు , ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దారులు పాల్గొన్నారు.
