ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.
:- ఎస్ఎఫ్ఐ పత్తికొండ మండల కార్యదర్శి విష్ణు
పత్తికొండ(నమస్తే భారత్):-ఆలూరులో ఈనెల 4-5 తారీకుల్లో ఆలూరు పట్టణంలో జూనియర్ కళాశాల ఆడిటరియంలో జరుగు
ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని పత్తికొండ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి విష్ణు పిలుపునిచ్చారు. బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలూరు పట్టణంలో 4 5వ తారీఖుల్లో జరిగే ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ మహాసభలకు పత్తికొండ నుండి మండల పరిధిలో ఉన్న అన్ని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్సు బిల్లులు నెలకు ₹3,000 ఇవ్వాలని
చదువు పోరాడు నినాదంతో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నా ఏకైక విద్యార్ధి సంఘం భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలను ఆలూరులోని డిసెంబర్ 4,5 తేదీలలో నిర్వహిస్తున్న సందర్బంగా ఆలూరు జూనియర్ కళాశాల ఆడిటరియంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు కే నరేంద్ర, కోశాధికారి ఎం ధర్మ తేజ, కార్యవర్గ సభ్యులు వి. వినయ్ కుమార్, ఆచారి, తదితరులు పాల్గొన్నారు.
