ఎస్‌బి‌ఐ బ్యాంకులో నగదు అవకతవకల పై ఐదుగురు నిందితుల రిమాండ్‌: మక్తల్ సీఐ రామ్ లాల్

On
ఎస్‌బి‌ఐ బ్యాంకులో నగదు అవకతవకల పై ఐదుగురు నిందితుల రిమాండ్‌: మక్తల్ సీఐ రామ్ లాల్

 

ఉట్కూర్ మండలం / నమస్తే భారత్

ఉట్కూర్ శాఖ ఎస్‌బి‌ఐ బ్యాంకులో 2016 నుండి 2019 వరకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలను సృష్టించి, బ్యాంకు అధికారులు మరియు మధ్యవర్తులు (బ్రోకర్లు) కలిసి 414 ఖాతాలలో సుమారు ₹3.91 కోట్ల మేర అవకతవకలు జరిపినట్లు విచారణలో తేలింది.
ఈ కేసులో ప్రధాన నిందితులను 1)SR నాగరాజు తండ్రి ఎల్లయ్య, బ్యాంక్ మేనేజర్, హైదరాబాద్.
2) మంత నరేష్ తండ్రి నర్సింగప్ప, క్యాషియర్, నారాయణపేట.
3) పూడూరు సత్యనారాయణ తండ్రి లక్ష్మయ్య తిప్రస్పల్లి.
4) మలీ పటేల్ సోమిరెడ్డి తండ్రి లేట్ వెంకట్ రెడ్డి, పెద్దపోర్ల.
5) జి కుర్మిరెడ్డి తండ్రి బాసి రెడ్డి. దండు, మక్తల్. 
ఐదుగురిని అరెస్టు చేసి ఈరోజు రిమాండ్‌కు తరలించినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్  తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.బ్యాంక్ అధికారుల సహకారంతో నకిలీ పట్టా పాస్ పుస్తకాలు, తప్పుడు ఖాతాల ఆధారంగా జరిగిన ఈ పెద్ద స్థాయి మోసం పై మేము పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.ఈ దర్యాప్తు కొనసాగుతూ, ఇంకా మరికొంతమంది నిందితులపై ఆధారాలు,సేకరించబడుతున్నాయని,ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ కోరారు.

Tags

Share On Social Media

Latest News

కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు  కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 
    ములుగు జిల్లానమస్తే భారత్ప్రతినిధి ఊరుగొండ చంద్రశేఖర్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్వర్యంలో సౌత్ ఇండియా 10th WFSK కరాటే పోటీలలో ప్రతిభ చాటిన సమ్మక్క సారలమ్మ మేడారం
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ! 
క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఊట్కూర్ పీ హెచ్ సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బదులు.... ప్రైవేట్ మెడికల్ కన్సల్టెన్సీ అని బోర్డు పెట్టండి
తెలంగాణ పెరిక కుల ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షలుగా యర్రంశెట్టి ముత్తయ్య

Advertise