స్నేహితునికి మేము సైతం..

On
స్నేహితునికి మేము సైతం..

 

 

మహేశ్వరం, నవంబర్, 30 నమస్తే భారత్ న్యూస్ ప్రతినిధి:

 

ఇటీవల మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి అతని మిత్ర బృందం పైసా పైసా పోగుచేసి స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచి భరోసాను కల్పించారు. మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన పుట్ల గారి కుమార్ కందుకూరు ఆదర్శ కళాశాలలో 2005 -2006 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యను అభ్యసించారు. గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుమార్ ఇటీవల మరణించాడు. ఆయన మృతితో ఆ కుటుంబానికి ఆదరణ లేకపోవడంతో తోటి స్నేహితులు చలించి వారి గురువుల సహకారంతో ఒక లక్ష రూపాయలను పుట్ల గారి కుమార్ కుటుంబానికి అందజేశారు. కందుకూరు మండల పరిధిలో ని ఆదర్శ కళాశాల పూర్వ విద్యార్థులు మృతిచెందిన తోటి విద్యార్థినికి అండగా నిలిచి భరోసా కల్పించారు. కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామ సురేందర్ రెడ్డి, గొర్రెంకల రామకృష్ణ, కాకర్ల ప్రభాకర్, చింతకింది రవి, జక్కుల రాజు, పెయ్యల మహేందర్, తిరుమల వీరస్వామి, కారం శెట్టి బలవంత్ తదితరులు పాల్గొన్నారు.

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise