తట్టుపల్లిలో కాంగ్రెస్‌కు భారీ షాక్ 100 మంది రాజీనామాలు

On
తట్టుపల్లిలో కాంగ్రెస్‌కు భారీ షాక్ 100 మంది రాజీనామాలు

 

పార్టీ లోకల్ నేతల అహంకారం ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ నిర్లక్ష్యం

రెడ్యానాయక్ సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరిక

నమస్తే భారత్:-కురవి

కాంగ్రెస్ పార్టీని కష్ట కాలంలో నిలబెట్టినవాళ్లను కాదనిస్వార్థం కోసం నిన్న, మొన్న కాంగ్రెస్‌లో చేరినవాళ్లకే టికెట్లు ఇస్తున్నందుకు నిరసనగా తట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామాలు జరుగుతున్నాయి.
డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం తట్టుపల్లి గ్రామ కాంగ్రెస్ నుండి ఏకంగా 100 మంది పార్టీ సీనియర్ నాయకులు, క్రియశీల సభ్యులు తమ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసిన ఘటన కాంగ్రెస్ పార్టీ అంతర్గత బలహీనతను బట్టబయలు చేసింది. సీనియర్ కేడర్, గ్రామ స్థాయిలో గత 11 సంవత్సరాల నుండి పోరాడిన నాయకులు పక్కనపెట్టి, కాంగ్రెస్‌కు ఓ రోజు కూడా పని చేయని, పార్టీ సభ్యత్వం కూడా లేని వారికి సర్పంచ్ టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంకు లోనై పార్టీ రాజీనామాలు చేసి బి. ఆర్. ఎస్  రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే డి. ఎస్. రెడ్యానాయక్ సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరారు.

డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అసమర్ధ రాజకీయాలు!
గ్రామంలో కాంగ్రెస్ బలహీన పడ టానికి కారణం ఒకటే ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ నా మాటే చట్టం నా అనుచరులకే టిక్కెట్, కాంగ్రెస్ పార్టీలోని నెహ్రు నాయక్ వర్గం వారికి టికెట్ ఇచ్చేది లేదని, ఆయన అడుగులకు మడుగులు వత్తె వారికే సర్పంచ్ పదవులు ఇస్తున్నారని, ఇదే పద్దతి గ్రామ నాయకులు కొనసాగించడం వల్ల తాము విసిగిపోయామని రాజీనామా చేసిన వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో గ్రూపుల రాజకీయాలే దెబ్బ
తట్టుపల్లిలో కాంగ్రెస్ ఒకే పార్టీ కాదు…గ్రూప్ ఏ,  గ్రూప్ బి, అమ్ముడైన గ్రూప్, రిక్రూట్ రాజకీయాలు, ఇలా నాలుగు ముక్కలైపోయి అబాసు పాలు అవుతుంది. ఇంత చిన్న గ్రామంలోనే పార్టీ ఇంతగా బ్రష్టుపడితే, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పేరు చెప్పేవాళ్లే ఉండరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పార్టీని రక్తం, చెమట, కష్టంతో నిలబెట్టిన వారికి అవమానం
కాంగ్రెస్ జెండా మోసినవారిని పక్కనబెట్టి, “డబ్బు, లాభం, కమిషన్” రాజకీయాలు నడిపితే ఇది తప్ప ఇంకేం వస్తుంది? అందుకే ఇది మా నిర్ణయం మా తిరుగుబాటని రాజీనామా చేసిన రాజీనామాలు చేసిన వారు గళం విప్పి ఒక హెచ్చరికలు చేశారు. మా కృషితో పలు ఎన్నికల్లో పనిచేస్తే తక్కువ చూపు చూసిన మిమ్మల్ని ఓడించి తీరుతాం...అన్న సందేశం ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో మారుమోగుతోంది.
స్థానిక ఎన్నికల్లో పరిస్థితి దారుణం
కాంగ్రెస్ పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం ఇక్కడ అసమ్మతి గ్రహించకుండా తప్పు చేసింది. ఎప్పుడు ఎమ్మెల్యే భజన చేసే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేపటి వ్యతిరేక ఓట్లే గట్టిగా శిక్షిస్తాయని, కాంగ్రెస్ నాయకులు గ్రహించాలి.

Tags

Share On Social Media

Latest News

Advertise