100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను వాడవాడల నిర్వహించండి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

నమస్తే భారత్ ప్రతినిధి జూన్ 22 భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ మండలంలో అన్ని గ్రామాలలో నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు
ఆదివారం నాడు శంషాబాద్ పట్టణంలోని మహిళా మండలి భవన్ లో జరిగిన సిపిఐ శంషాబాద్ మండలం నాలుగోవ మహాసభ లో ఆయన పాల్గొని మాట్లాడారు
ఈ మహాసభ అన్యపు ప్రభు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ సిపిఐ 100 సంవత్సరాలు ఈ దేశంలో ప్రజల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ అని ఆయన అన్నారు ఎన్నో త్యాగాలు ఎన్నో బలిదానాలు ఈ దేశం కోసం తెలుగు నేల కోసం అర్పించిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కమ్యూనిస్టు పార్టీని ఆయన కొనియాడారు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ విప్లవ పోరాటాలు నిర్వహిస్తున్నదని రాబోయే కాలంలో ఇండ్ల స్థలాల కోసం భూ పోరాటాలు నిర్వహిస్తామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ మహాసభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి మండల కార్యదర్శి నర్రగిరి జిలక రాజు నరేష్ నాయక్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
నూతన కమిటీ ఎన్నిక
సిపిఐ శంషాబాద్ మండల నూతన కమిటీ 15 మందితో ఏర్పడింది
మండల కార్యదర్శిగా నర్రగిరి సహాయ కార్యదర్శిగా అన్యపు ప్రభు ను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నిక అయిందని తెలిపారు
About The Author
Advertise


Latest News
