మహేశ్వరంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. 

On
మహేశ్వరంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. 

 

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్. 

మహేశ్వరం, డిసెంబర్ 2, సామాజిక తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీ మహేశ్వరంలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్ గౌడ  సంఘం నాయకులతో కలిసి నియోజకవర్గం ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు లోనై ఎంతో మంది బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు, మహిళలకు, కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఆదుకుంటుందని ఆయన అన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా అభ్యర్థుల కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్, కబడ్డీ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కర్ణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, అమీర్పేట గౌడ సంఘం అధ్యక్షుడు బసవ యాదయ్య, సత్తయ్య, ఈశ్వరయ్య, తాళ్ళ అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise