స్కిల్స్ ఉన్నోడినే డివైఎస్ఓ గా ఏంపిక చేయాలి..
జంగపల్లి వెంకట నరసయ్య డివైఎస్ ఓ గా అనర్హులు
సీనియర్ లను తొక్కేసి పైరవిలతో పోస్ట్ కొట్టేసి..?
క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న జంగపల్లి
దుబ్బాక లోని కరాటే మాస్టర్లు
దుబ్బాక..నమస్తే భారత్..
సిద్దిపేట జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి జంగపల్లి వెంకట నరసయ్య వల్ల దుబ్బాక పరిసర ప్రాంతాల్లో కరాటే కోచింగ్ పనుల్లో అన్యాయం జరిగినదని జిల్లా విద్య అధికారికి లేఖ రాసారు. దుబ్బాక లోని స్థానిక కరాటే మాస్టర్లు.దుబ్బాక పరిసర ప్రాంతాల్లో గత పది సంవత్సరాలుగా కరాటే క్లాసులు నిర్వహిస్తూ, పలు స్కూళ్ల విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అనుభవజ్ఞులైన కరాటే మాస్టర్లు అధిక కృషి చేసి అనేక గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. విద్యార్థులు క్రమంగా క్రీడా ప్రావీణ్యాన్ని పెంపొందించుకునే ఈ సందర్భంలో వారికి సరైన గుర్తింపు ఇవ్వకుండా, అనుభవం లేని వేరే ప్రాంతానికి చెందిన కరాటే మాస్టర్‌కు అవకాశం ఇవ్వడం అన్యాయంగా ఉంది.దుబ్బాక ప్రాంతంలో క్రీడా ప్రతిభను పెంపొందించే ఉద్దేశ్యంతో కృషి చేస్తున్న స్థానిక కరాటే మాస్టర్లను పక్కనపెట్టడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.*డీవైఎస్ఓ సిద్దిపేట జిల్లా క్రీడలు,యువజన శాఖ అధికారి జంగపల్లి వెంకట నరసయ్య
నిర్ణయం పునరాలోచన చేయబడవలసిందిగా స్థానికంగా సుదీర్ఘంగా సేవలందిస్తున్న కరాటే మాస్టర్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.సమస్యను దయచేసి పరిశీలించి, దుబ్బాక ప్రాంత క్రీడా అభివృద్ధికి అన్యాయం జరగకుండా తగిన సూచనలు ఇవ్వగలరనికోరారు..
