ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బదులు.... ప్రైవేట్ మెడికల్ కన్సల్టెన్సీ అని బోర్డు పెట్టండి

On
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బదులు.... ప్రైవేట్ మెడికల్ కన్సల్టెన్సీ అని బోర్డు పెట్టండి

 

వైద్యం అందక రోగులు ఆవేదన

నమస్తే భారత్: భద్రాచలం


పేద మధ్య తరగతి వారు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వారి వద్ద స్తోమత లేకపోతే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని తట్టుకోలేక వారు ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి వెళ్తారు. కానీ ఈమధ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లాలి అన్న కూడా దోపిడీకి గురవుతావేమో అని  రోగులు చాలావరకు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మందులు రక్త పరీక్షలు స్కానింగ్ అన్ని డ్యూటీ డాక్టర్లే బయటికి రాస్తున్నారు. వారే స్వయంగా ప్రైవేటు యాజమాన్యం వారికి ఫోన్ చేసి మరి రప్పిస్తున్నారు. అసలు ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాలు స్కానింగ్ సెంటర్ పుస్తకాలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎందుకుంటున్నాయి. ఆ రక్త పరీక్ష కేంద్రాల వారు స్కానింగ్ సెంటర్ వారికి ప్రభుత్వం నుంచి గాని జిల్లా కలెక్టర్ నుంచి గాని ఏమైనా ప్రత్యేక అనుమతులు ఉన్నాయా. అసలు 200 పడకల సామర్థ్యం ఉన్న ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల రక్త పరీక్షలు చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న ఎక్స్ రే మరియు స్కానింగ్ అనేది 24 గంటలు అందుబాటులో ఉండి 24 గంటలు టెక్నీషియన్లు కూడా ఉండాలి కాని అసలు రక్త పరీక్షలు ఎక్కడ చేపించుకోవాలి అనేది డ్యూటీ డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు. ఏ స్కానింగ్ సెంటర్ కి వెళ్ళాలనిది కూడా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ పుస్తకాలు అసలు ఏరియా ఆసుపత్రిలో లో ఎందుకుంటున్నాయి. ఇందులో డ్యూటీ డాక్టర్ల కమిషన్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. చాలావరకు అవసరం ఉన్నా లేకపోయినా వీరు రక్త పరీక్షలను మరియు స్కానింగ్ లను ప్రైవేట్ వాటికి రాస్తున్నారు. అంతేకాకుండా *ఎవరు ఏ ప్రైవేటు ఆసుపత్రి కి వెళ్లాలి అనేది కూడా డ్యూటీ డాక్టర్లే సలహాలిస్తున్నారని అవసరమైతే వారే ప్రైవేట్ అంబులెన్స్ వారికి కూడా ఫోన్ చేసిన రప్పిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో ఆసుపత్రికి వచ్చే రోగులు గాని బాధితులు గాని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా కూడా డబ్బులు ఖర్చవుతున్నాయని అసలు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను ఎందుకు వాడుకలోకి తీసుకొని రావడం లేదు అని, అలాగే రక్త పరీక్షలు ఎందుకు బయటకు పంపిస్తున్నారు 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అవి ఎందుకు చేయడం లేదు అనేది తెలియాల్సి ఉంది. అలాగే స్కానింగ్ కూడా ఉన్నప్పటికీ దానిని 24 గంటలు ఎందుకు అందుబాటులోకి తీసుకొని రావడం లేదని చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత ఉంటే ఎవరు వారిని తెప్పించుకోవాలి. రెగ్యులర్ సిబ్బంది లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో నియమకాలు చేపట్టి అన్ని పరీక్షలు స్కానింగ్లు వాడుకులకు తీసుకుని రావాలి అని అసలు ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి అంటేనే అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల పరీక్షలు స్కానింగ్లు సర్జరీలు డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. అలాంటిది వీటికి ఒక సమయం కేటాయించడం ఏంటి అనేది కూడా విచారణ చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రైవేట్ మెడికల్ దందా కు సహకరిస్తున్న సిబ్బందిని ఎటువంటి పక్షపాతం లేకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి 

డిసిహెచ్ఎస్, డి ఎం హెచ్ ఓ సంయుక్తంగా విచారణ చేపట్టాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ దందాకు సహకరిస్తున్న ప్రభుత్వ రెగ్యులర్ మరి కాంట్రాక్టు ఉద్యోగుల మీద చర్యలు విచారణ చేపట్టి డిసిహెచ్ఎస్ వారు ఎంత స్థాయిలో ఉన్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వేరే ఆసుపత్రిలో ప్రైవేట్ రక్త పరీక్షల కేంద్రం వారు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వారు ఏ విధంగా వారు పుస్తకాలను అమర్చారో అలాగే ప్రైవేట్ మెడికల్ వారు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఏర్పరచుకున్న ఒప్పందం ఏంటి అనేది విచారణ చేసి అటువంటి ప్రైవేట్ మెడికల్ వ్యవస్థ మీద కూడా చర్యలు చేపట్టాలి. ఇద్దరు అధికారులు కలిసి ఉచిత వైద్యం తో పాటు ఉచిత పరీక్షలు స్కానింగ్ ప్రజలకు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు

Tags

Share On Social Media

Latest News

కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు  కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 
    ములుగు జిల్లానమస్తే భారత్ప్రతినిధి ఊరుగొండ చంద్రశేఖర్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్వర్యంలో సౌత్ ఇండియా 10th WFSK కరాటే పోటీలలో ప్రతిభ చాటిన సమ్మక్క సారలమ్మ మేడారం
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ! 
క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఊట్కూర్ పీ హెచ్ సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బదులు.... ప్రైవేట్ మెడికల్ కన్సల్టెన్సీ అని బోర్డు పెట్టండి
తెలంగాణ పెరిక కుల ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షలుగా యర్రంశెట్టి ముత్తయ్య

Advertise