Tag
shadnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరు మారదా
Published On
By Shiva Kumar Bs
అత్యవసర సమయంలో సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు..
పేషెంట్ కన్నా ఫోన్ కే ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వసుపత్రి వైద్యులు
ఫోన్ మాట్లాడుతున్నారని అడిగితే..
నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కేసులు చూశా.
అంటూ బాధితులపై వైద్యురాలి అసహనం..
ప్రభుత్వాసుపత్రి వైద్యులపై చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు
వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు దేవుడితో సమానం కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ పదాలకు రివర్స్ గా పని చేస్తున్నారు ప్రాణాలను అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు సెల్ ఫోన్ కు ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళ ఆర్టిసి బస్సు దిగుతున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్ల కింద పడడంతో తలకు గాయాలయ్యాయి అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు 108 సహాయంతో గాయాల పాలైన మహిళను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు
Published On
By Shiva Kumar Bs
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డిప్యూటీ DMHO కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ వి.విజయలక్ష్మి, డాక్టర్ అమృత జోసఫ్ సిపిఆర్ పైన అవగాహన కల్పించారు. CPR అనగా కార్డియో పల్మరీ రిసర్కిటేషన్ అని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ ప్రాసెస్ మూడు స్టెప్ ల ద్వారా చెయ్యాలని తెలియజేసారు. మేమేమైనా లంగలమా.. దొంగలమా..?
Published On
By Shiva Kumar Bs
గల్లా పట్టి ఈడ్చుకెళ్ళి కొడతారా..
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య ఆగ్రహం
పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి
ధర్నాలు, ఆందోళనలు చేసే శంకర్ ఎమ్మెల్యే అయ్యాడనీ మరిచారా..?
పోలీసులపై డిజిపికి ఫిర్యాదు చేస్తాం
షాద్ నగర్ పోలీసులు అక్రమ కేసు బనాయించారు
ప్రశ్నిస్తూనే ఉంటాం.. అక్రమ కేసులకు భయపడము
ప్రశాంత్ కు అండగా షాద్ నగర్, కొందుర్గు, చౌదరిగుడ, కేశంపేట, కొత్తూరు బిజెపి నాయకులు
బీసీలపై రెడ్డి జాగృతి సంస్థ కుట్ర
Published On
By Shiva Kumar Bs
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాంతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9ను ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ హై కోర్టులో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు తగ్గించాలని వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జేఏసీ బహుజన నేతలు... SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు
Published On
By Shiva Kumar Bs
అప్రమత్తమైన పోలీసులు - అదుపులోకి తీసుకొన్న వైనం
పోలీసులకు ప్రశాంత్ కు మధ్య వాగ్వివాదం
వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగం శవంతో క్యాంపు కార్యాలయం సమీపంలో ఆందోళన
వాగులో పడి మరణించిన దస్తగిరి లింగం ది ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు
50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఎమ్మెల్యే రావాలి అంటూ ఆందోళన రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి
Published On
By Shiva Kumar Bs
బీజేపీ పార్టీ నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు రక్తదానం
మోదీ కోసం రక్తమే కాదు ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధమే"ఎంకనోళ్ల వెంకటేష్" బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
షాద్ నగర్ సెప్టెంబర్17: భారతప్రదాని పూజ్యులు నరేంద్రమోది 75 వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం షాద్ నగర్ పట్టణంలోనీ ఏబీ కాంప్లెక్స్ లో షాద్ నగర్ టౌన్ మరియు ఫరూక్ నగర్ మండలం సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషకరమని. అందులో ఉడతా భక్తిగా తను కూడా రక్త దానం చేయడం తన పూర్వజన్మ సుకృతం అని బీజేపీ నాయకులు ఎంకనోళ్ల వెంకటేష్ పేర్కొన్నారు.
ఎంకనోళ్ల వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ., భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 వ పుట్టినరోజు సందర్భంగా సేవ భావానికి దాతృతానికి ఈ దేశం పై ఉన్న ప్రేమ అకుంఠత దీక్షకు ప్రతిఫలంగా రక్తదానం చేయడం చాలా చిన్న విషయం అని ఎన్నో సందర్భాలలో రక్త దానం చేయడం జరిగిందని కానీ ఈ రోజు నరేంద్ర మోదీ పుట్టిన సందర్భంగా రక్తదానం చేయడం చాలా ప్రత్యేకమైంది అని ఆయనకోసం రక్తమే కాదు ప్రాణాలు ఇచ్చిన తక్కువే అని ఆయనకు సేవ చేసుకొనే భాగ్యం ఈ విదంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు నరేంద్ర మోదీ మరో శివాజీ, మరో సుభాష్ చంద్రబోస్,ఆయన ఈ దేశంలో పుట్టడం భారతావని చేసుకున్న అదృష్టం ఇలాంటి మనిషి మల్ల పుట్టాడు అని ఆయన ఉండగా ఈ దేశాని కి ఎలాంటి ముప్పు వుండదని,ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుట్టించే కర్మయోగి ఈ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన యోధుడు నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. ఆ మహనీయుని కోసం ఎంతచెప్పినా తక్కువే ఆడంబరాలకు పోకుండా తన కన్న తల్లి అంత్యక్రియలు అనుకున్న సమయంలో పూర్తిచేసి వెంటనే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మకుటం లేని మనిషి నరేంద్ర మోదీ, ప్రధానిగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్న మహోన్నత మైన వ్యక్తి మోదీ, దేశ హితమే తన ద్యేయంగా దేశ ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తున్న ప్రధాని ఆయురారోగ్యాలతో ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనీ వారికి మరొక్క సారి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షేరీ విష్ణువర్ధన్ రెడ్డి,పిట్టల సురేష్,భూషణ్ తదితరులు పాల్గొన్నారు. దొంగలించిన మేకలు గొర్రెలు జియాగూడ మార్కెట్ లో అమ్మకం
Published On
By Shiva Kumar Bs
గత కొన్నేళ్లుగా రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం
రూ.2.62 లక్షల నగదు, నాలుగు వాహనాలు, 7 మొబైల్ లు, 4 కార్లు స్వాధీనం
మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ వెల్లడి
షాద్ నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మేయాలి.. చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువత ఒక ముఠాగా మారి చేస్తున్న ఈ ఆగడాలకు షాద్ నగర్ పోలీసులు తెరదించారు. రెండు జిల్లాలలో వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ ఈ ముఠా కు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం తో పాటు, కర్ణాటక , హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతానిలకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ (24), అబ్దుల్ కలీం (25), మొహమ్మద్ సోహెల్ (24), షేక్ రవూఫ్ (23), మహమ్మద్ జమీర్ (26), మహమ్మద్ ఆరిఫ్ (25), షేక్ హసీనుద్దీన్ (22), కోయల్ కార్ సాయికిరణ్ (30)లు ఈ దోపిడీ ముఠాలోని సభ్యులు. చిన్నతనం నుంచి చెడు స్నేహాలకు అలవాటు పడి మత్తుపదార్థాలకు బానిసలైన ఈ యువకులు డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం నాలుగు వాహనాలను తమకు అందుబాటులో పెట్టుకున్నారు. ఆయా వాహనాలలో రోజు తిరిగి మేకలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి రాత్రి కాగానే ఒక డీసీఎం తీసుకుని వెళ్లి మేకలను అందులో ఎక్కించి జియాగూడ మార్కెట్లో అమ్మి వేయడం వీళ్లు దినచర్యగా పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే షాద్ నగర్ పరిధిలో చించోడులో 28, వెలిజర్లలో 8, చౌదరిగుడాలో 8, ఎల్కిచర్లలో 23, కొందుర్గు మండలం తంగెడపల్లిలో 8, వెంకిర్యాలలో 9, పరిగి మండలంలో కోటివాడలో 12, సుల్తాన్ పూర్ లో 30, దోమ మండలం వుదంతారావు పల్లి లో 15, జధిరసం పల్లిలో ఆరు మేకలు, గొర్రెలను దొంగిలించారు. ఇదే రీతిన ఈనెల 14వ తేదీన పురపాలక పరిధిలోని సోలిపూర్ వద్ద దొంగతనానికి పాల్పడుతుండగా షాద్ నగర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి రాజేష్ పర్యవేక్షణలో సాగిన ఈ విచారణ సిపిఎస్ డిసిపి ముత్యంరెడ్డి, అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, శ్రీలక్ష్మి ల నేతృత్వంలో విచారణ కొనసాగింది. షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్,డిటెక్టివ్ సిఐ వెంకటేశ్వర్లు లో ఆధ్వర్యంలో ఎస్సై లు పవన్ కుమార్, అవినాష్ బాబు, శ్రీనివాస్, భూపాల్, శివారెడ్డి, సిబ్బంది కుమార్, మహేందర్, జాకీర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య, రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జాకీర్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 