భారత్‌ను అతలాకుతలం చేస్తున్న ప్రకృతి విపత్తులు.
ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైనట్లు ఓ నివేదిక తాజాగా వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా గత మూడు దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల బారిన పడిన దేశాల్లో భారత్ (Climate Disasters) తొమ్మిదో స్థానంలో ఉంది. 1995 నుంచి 2024 వరకూ చోటుచేసుకున్న 430 ప్రకృతి విపత్తుల్లో 80,000 మంది మరణించారు. సుమారు 130 కోట్ల మంది ప్రభావితమయ్యారు. అంతేకాదు 170 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (think tank Germanwatch Climate Risk Index) నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నష్టం 1998 గుజరాత్ తుపాన్లు, 1999లో ఒడిశాలో సూపర్ తుపాను, 2013 ఉత్తరాఖండ్ వరదలు సహా, కరవు, హీట్‌వేవ్స్ వల్ల సంభవించినవిగా సదరు నివేదిక తెలిపింది.
