పదవి విరమణ పొందిన సువర్ణ జగన్
హాజరైన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ వి విజయలక్ష్మి
ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్
నమస్తే భారత్ షాద్ నగర్నవంబర్28: షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పిపి యూనిట్ లో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ సువర్ణ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో, ఈరోజు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పదవి విరమణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి విజయలక్ష్మి మరియు షాద్ నగర్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. హెల్త్ సూపర్వైజర్ సువర్ణ 1964 సంవత్సరము నవంబర్ 25వ తేదీన జన్మించి, తమ యొక్క విద్యబ్యాసము ఫరూఖ్ నగర్ ప్రైమరీ స్కూల్లో ఒకటి నుంచి ఏడవ తరగతికి వరకు చదువుకొని, ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు షాద్ నగర్ గర్ల్స్ హైస్కూల్లో విద్యాభ్యాసము పూర్తి చేశారు. తదుపరి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత. 18 నెలలు ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన వెంటనే 1993 ఫిబ్రవరి 25వ తారీఖున కొల్లాపూర్ తాలూకా కోడేరు మండలంలోని ఎత్తo సబ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు. అక్కడ ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడంలో బెస్ట్ అవార్డు పొందారు. తదుపరి జానంపేట పి హెచ్ సి లో ఆవంచ సబ్ సెంటర్లో నాలుగు సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన తర్వాత షాద్ నగర్ డివిజన్ లో పిహెచ్సి కేశంపేట లో జాయిన్ ఓ.పి డ్యూటీ సేవలు అందించారు. అక్కడ 2016 సంవత్సరం వరకు పనిచేసి, 2016లో హెల్త్ సూపర్వైజర్ గా ప్రమోషన్ పొంది షాబాద్ మండలంలోని చందన వెళ్లి పి హెచ్ సి కి వెల్లి ఎనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా ఆమె సర్వీస్ పూర్తి చేసుకుని, 2024 సంవత్సరంలో డిసెంబర్ 26వ తేదీన షాద్ నగర్ పి పి యూనిట్ లో హెల్త్ సూపర్వైజర్ జాయిన్ అయి ఆమె సేవలు ఈనాటి వరకు విజయవంతంగా అందిస్తున్నారు. సువర్ణ సర్వీసు ఏఎన్ఎం గా హెల్త్ సూపర్వైజర్ గా వివిధ ప్లేస్లలో పనిచేసి, ప్రజలేక అభినందనలు పొంది 33 సంవత్సరాల సర్వీస్ పొంది ఈరోజు పదవి రమణ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఇదే కార్యక్రమంలో సువర్ణ యొక్క భర్త జగన్ కూడా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దోబీగా మరియు ఎమ్మెన్నార్ 24 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవి విరమణ పొందారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీ రామ, పీపీ యూనిట్ స్టాఫ్ నర్స్ వినీత, పిపి యూనిట్ సీనియర్ అసిస్టెంట్ పద్మ, ఏఎన్ఎం స్వప్న, షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు, హెడ్నర్స్, స్టాఫ్ నర్స్లు మరియు పి పి యూనిట్ ఆశాలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
