కలలు కనండి కలలను సాకారం చేసుకోండి అంటున్నా కుంగ్ ఫు మాస్టర్
న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ నంది అవార్డు గ్రహీత మాస్టర్ అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ ) కు లెజెండరీ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ లైఫ్ టైం లెగసి అవార్డు
అత్యంత ప్రతిభ కనబరిచిన న్యూ పవర్ కుంగ్ ఫు న్యూ పవర్ విద్యార్థులు
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 10:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రముఖ కుంగ్ ఫు కోచ్ నంది అవార్డు గ్రహీత మాస్టర్ అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ )కు అవార్డు లెజెండరీ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ లైఫ్ టైం లెగసి అవార్డు సముద్రుడు హీరో రమాకాంత్, ఆయుష్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైతన్య చేతుల మీదుగా శ్రీ సాయి రమ్య ఫంక్షన్ హాల్ దేవరకొండలో జరిగిన ఫస్ట్ నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 ప్రదర్శనలో ఈ అవార్డు అందుకున్నారు. కలలు కనండి కలలను సాకారం చేసుకోండి అనే నానుడి అహర్నిశలు కష్టపడే తత్వం తమ విద్యార్థులకు కుంగ్ ఫు లోని మెలకువలు నేర్పించి తనదైన శైలిలో షాద్నగర్ లో ఒక ప్రత్యేక స్థానంలో నిలుస్తున్న న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ నంది అవార్డు గ్రహీత మాస్టర్ అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ).తమ విద్యార్థులు అన్ని రంగాలలో ముందంజ వేయడానికి ఆయన శాయశక్తుల కష్టపడతానని అలానే పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సాహము ఎంతో ఉండాలని కోరారు. ఈ ప్రదర్శనలో తమ విద్యార్థుల్లో మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు అజ్మ, జునైనా, దేవాన్ష్,ప్రేమ్ కుమార్, దినేష్,శ్రీశాంత్. ద్వితీయ బహుమతి సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థులు ఇషిక, మోహిత్, చరణ్ తేజ్ మెడల్స్ సాధించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ బాలరాజ్, మాస్టర్ అమర్ సింగ్, మాస్టర్ కన్నాన్ గౌడ్, మాస్టర్ కేశవులు, మాస్టర్ శివకృష్ణ, కరాటే మాస్టర్ శివకృష్ణ గౌడ్, మాస్టర్ ఆలూరు రాములు, మాస్టర్ సురేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
