కేసీఆర్ అమరణ నిరాహారదీక్షనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం వేసింది
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాయక సమావేశంలో పాల్గొన్న అంజయ్య యాదవ్
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్26:2009లో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడని, ఆ నిరసన దీక్షనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సూచించిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ నవంబర్ 29 న దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంచను అడ్డుకునేందుకు అప్పటి పాలకులు అడుగడుగునా అడ్డుపడ్డారని, సమైక్యవాదుల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ స్వరాష్ట్రాన్ని సాధించుకునే అంతవరకు ఆయన ఉద్యమించిన తీరు ఎప్పటికీ ఆదర్శనీయమని అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, సకలజనులకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ ది ప్రముఖ పాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, కార్తిక్ రెడ్డి తదితరులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
