చర్లపాలెంలో శ్రమదానం చేస్తున్న వాలంటర్లు

On
చర్లపాలెంలో శ్రమదానం చేస్తున్న వాలంటర్లు

 

ప్లాస్టిక్ నిర్మూలనపై ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ఎం.మనీషా.కె.శ్రీకాంత్.డాక్టర్ వాల్యా నాయక్ డాక్టర్ సుజాత

సేవా పథం.సామాజిక చైతన్యం.

సామాజిక సేవే పరమావధిగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

ఉత్సాహంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంపు

సామాజిక చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు

నమస్తే భారత్ :-తొర్రూరు

స్వచ్చంద సమాజ సేవ ద్వారా విద్యార్థి వ్యక్తిత్వ స్వభావాన్ని అభివృద్ధి చేయడం కోసం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు జాతీయ సేవా పథకం అమలు చేస్తున్నారు. సేవ ద్వారా విద్య అందించాలనేది పథక లక్ష్యం.నాట్ మీ బట్ యూ (నా కోసం కాదు, నీ కోసమే) అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ కొనసాగుతోంది. దానిలో భాగంగా తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ల ఆధ్వర్యంలో మండలంలోని చెర్లపాలెం గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వాల్యా నాయక్, డాక్టర్ సుజాతల పర్యవేక్షణలో శిబిరం విద్యార్థుల్లో సేవా దృక్పథాన్ని అలవర్చేందుకు దోహదపడుతోంది.చైతన్యం తెచ్చేలా చెర్లపాలెం క్యాంపు
జాతీయ సేవా పథకం క్యాంపులో భాగంగా మండలంలోని చెర్లపాలెం గ్రామాన్ని ఎంపిక చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ గ్రామం మండలంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రామంగా పేరుగాంచింది.ఈ గ్రామంలో చైతన్యం కలిగిన వ్యక్తులు, విద్యాధికులు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు తారసపడతారు. అలాంటి గ్రామంలో క్యాంపు నిర్వహిస్తే విద్యార్థులకు మంచి అనుభవం వస్తుందనే ఉద్దేశంతో చెర్లపాలెంను ఎంచుకున్నారు.గ్రామంలో ఏడు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆ శిబిరాల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యత, జాతీయ సాహస శిబిరాలకు  ఎంపిక చేసేందుకు ఎన్ఎస్ఎస్ అధికారులు సన్నద్ధమయ్యారు.క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడంతో పాటు వివిధ కళాశాలల్లో,ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్లు కీలకంగా మారనున్నాయి.గ్రామంలో సమస్యలు తెలుసుకొని.
ప్రత్యేక శిబిరంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)రెండు యూనిట్లకు చెందిన 100 మంది వాలంటీర్లు చెర్లపాలెంలో జరిగిన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఏడు రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు.గ్రామంలోని పలు కాలనీలలో చెత్తాచెదారం వ్యర్ధాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.  పలు సామాజిక రుగ్మతలపై గ్రామంలో ప్రజలను చైతన్యం చేశారు. పలు అంశాలపై ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల తలెత్తే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఉదయం సాయంత్రం వేళల్లో స్థానిక ప్రజలకు మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు,మూఢనమ్మకాలవల్ల కలిగే నష్టాలు,డ్రగ్స్ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు, త్రాగునీరు, వైద్య సేవలు,అధికంగా ప్రబలుతున్న వ్యాధులు తదితర అంశాలపై సర్వే నిర్వహించారు.నిరక్షరాస్యులను గుర్తించి చదువుకునేలా ప్రోత్సహించారు.ఏడు రోజులపాటు విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ అధికారులు భోజనం, వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించారు.
మంచి అవగాహన కలిగింది ఎం. మనీషా,బీజెడ్ సీ, సెకండియర్ విద్యార్థిని.జాతీయ సేవా పథకం ద్వారా ఇలా సేవలు చేయవచ్చనేది ఈ శిబిరంలో పాల్గొనడం వల్ల తెలిసింది.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఏర్పడింది. వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరంలో పాల్గొనడం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ,వ్యక్తిత్వ వికాసం, సేవాభావంపై అవగాహన ఏర్పడింది.
కొత్త అంశాలు నేర్చుకున్నాం
కె. శ్రీకాంత్,బీఏ సెకండియర్ విద్యార్థి.
ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు వాల్యా, సుజాత లు అనేక అంశాలపై దిశ నిర్దేశం చేశారు.ఈ క్యాంపు ద్వారా ఒక విద్యార్థిగా అనేక అంశాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగింది.ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా క్యాంపులో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నా.క్యాంపు లతో విద్యార్థులకు ఉపయోగం
డాక్టర్ వాల్యా నాయక్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్.విద్యార్థులకు ఈ దశలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహించడం వల్ల వారికి సామాజిక అంశాల పట్ల అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి.క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు వివిధ అంశాలపై అవగాహన పొందుతున్నారు. ఉదయం సాయం, సమయంలో పరిశుభ్రత,స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండే సామాజిక స్పృహ పెంపొందడానికి , చైతన్యం తీసుకురావడానికి ఈ క్యాంపు దోహదపడింది. 
సేవా దృక్పథం అలవడుతుంది 
డాక్టర్ సుజాత,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్.విద్యార్థులు సమాజ సేవ చేస్తూనే తమ భవితకు బాటలు వేసుకుంటారు. సేవా దృక్పథంతోపాటు వ్యక్తిగత నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి ఈ శిబిరాలు దోహదపడతాయి. ప్రతిభ కనబరిచే వారిని జాతీయ సమైక్యత శిబిరాలు, రిపబ్లిక్ డే పరేడ్, సాహస శిక్షణ కార్యక్రమాలకు పంపుతాం.

Tags

Share On Social Media

Latest News

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం...
అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉదాసీనత వైఖరి 
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
తాడ్వాయి మండలం కొత్తూరు ఊరట్టం కాలనీలో నీళ్ల కొరత 2023 సం, నుండి అధికారులు పంటించుకోవడంలేదు
ఘనంగా కమ్మ వారి కార్తీక మాస వన భోజనాలు 
బూర్గుల సుమన యాదిలో..
"ఆపద్బాంధవుడు" ఎస్సై గండ్రాతి సతీష్

Advertise