సింగరేణి డైరెక్టర్ల సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై చర్చించాలి. వారి కనీస వేతనాలను పెంచాలి

కార్మికులకు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నేత ఐ కృష్ణ డిమాండ్

సింగరేణి డైరెక్టర్ల సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై చర్చించాలి. వారి కనీస వేతనాలను పెంచాలి

నమస్తే భారత్: మణుగూరు : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 30 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను త్వరలో హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగే డైరెక్టర్ల సమావేశంలో చర్చించి వారి వేతనాలను పెంచాలని కోలిండియా వేతనాలను అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు ఐ క్రిష్ణ పిలుపునిచ్చారు. రైటర్ బస్తిలోని కొత్తగూడెం ఐ ఎఫ్ టి యు కార్యాలయo నందు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కే.సారంగపాణి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారి ప్రసంగిస్తూ సింగరేణి మేనేజ్మెంట్ 1000 కోట్ల లాభంలో ఉందని చెబుతున్న ఎందుకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచడం లేదని వారి సమస్యలను పరిష్కరించడం లేదని వారి కనీస అవసరాలు తీర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భాగంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఇప్పటివరకు జరిగిన సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఊసే ఎత్తలేదని ఇది సరైనది కాదని వారన్నారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికుల శ్రమ లేకుండా సింగరేణి లాభాల్లో లేదని ఈ విషయాన్ని సింగరేణి మేనేజ్మెంట్ గుర్తించాలని వారు అన్నారు సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జాతీయ సెలవు దినాలను వారి వేతనాలను ఇవన్నీ రేపు డైరెక్టర్ ల సమావేశంలో చర్చించి కోల్ ఇండియా వేతనాలను అమలు చేయాలని వారు అన్నారు. ఈసారి సింగరేణి ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ ని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని సింగరేణి క్వార్టర్స్ ను కూలగొట్టి ప్రభుత్వానికి ఇవ్వడాన్ని ఐ ఎఫ్ టి యు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కార్మికులకు ఇవ్వాలని వారు అన్నారు. సింగరేణి క్వార్టర్స్ ను కూలగొట్టి ప్రభుత్వానికి ఇస్తూ బలవంతంగా కార్మికులను నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించడం సరైనది కాదని వారన్నారు తక్షణమే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతన చట్టాలను అమలు చేసే విధంగా ప్రభుత్వాలు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాసే 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేయడని వ్యతిరేకించాలని,ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక వర్గాన్ని కట్టి బానిసత్వానికి గురి చేసే లక్ష్యంతో *ఆర్ఎస్ఎస్ బిజెపి సర్కార్ తెచ్చే లేబరు కోడ్ ల రద్దుకై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని కోరుతూ కార్మిక వర్గం అంత 139వ మేడే జరపాలని ఆయన పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కే సారంగపాణి,రాష్ట్ర నాయకులు డి ప్రసాద్,గౌని నాగేశ్వరరావు,ఎండి రాశుద్దిన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్,కోశాధికారి మోతుకూరి మల్లికార్జునరావు,జిల్లా నాయకులు రావూరీ ఉపేందర్రావు, సురేష్, మారుతిరావు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఐ మాక్స్ లైట్ల ప్రారంభం ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్  తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి  పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి  జన్మదిన వేడుకలు
మహిళా చట్టాలపై మహిళలు ఉండే ప్రదేశానికి వెళ్లి  అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షీటీమ్ బృందం  
కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.