అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయాలి..
పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి
నమస్తే భారత్: పినపాక :సంక్షేమ పథకాలను ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకున్నట్లు వస్తున్న వార్తలు నిజమో అబద్దమో అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం సర్వే నిర్వహించి సర్వే చేసిన లిస్టును పక్కనపెట్టి అధికార పార్టీ నాయకుల కనుసన్నలో అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ముడుపులు చెల్లిస్తేనే లిస్ట్ ల పేరు పెడుతున్నట్లు వస్తున్న పుకార్లపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అర్హత కలిగినటువంటి పేదలకు మాత్రమే ఇల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారి పార్టీ చెప్పిన వాళ్లకు మాత్రమే ఇల్లులు మంజూరు చేస్తే ఊరుకుండేది లేదు అన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీర్తిశేషులు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అన్నా రానాడు ఎంతోమంది రాష్ట్రంలోని పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు ఆనాటి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించారని అన్నారు, అదేవిధంగా ఆనాడు వారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ రోజులలో ఇంటి నిర్మాణం కోసం లక్ష రూపాయలు శాంక్షన్ చేశారా ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా దళారులు బిల్లులు మార్చుకున్నారు దీనిని మీద కూడా ఎంక్వయిరీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుని కోరారు. అదేవిధంగా ఈ సమస్య మీద వారందరిని కలిసి ప్రజలతో కలిసి వినతి పత్రాలు అందజేస్తామని సమస్యల పరిష్కారం కోసం ముందుంటా మన్నారు..
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
