రెజ్లింగ్ క్రీడాకారులను సన్మానించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ఈనెల 1వ తారీకు రోజున హైదరాబాదులో జరిగినటువంటి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఛాంపియన్షిప్లో బాలమని 49 కేజీ ల కేటగిరీలో శివరంజని 73 కేజీల కేటగిరిలో గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయస్థాయికి ఎంపిక కావడం జరిగింది ఈ ఈ క్రీడాకారులు ఎంపిక పట్ల జిల్లా కలెక్టర్ మేడం గారు క్రీడాకారులను సన్మానించడం జరిగింది అలాగే ఈనెల 25వ తేదీ నుండి చండీగఢ్ లో జరిగే జాతీయస్థాయిలో ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని కలెక్టర్ క్రీడాకారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి వెంకటేష్ మరియు అసోసియేషన్ సెక్రెటరీ రవికుమార్ పీడీలు బాలరాజ్ వెంకటేష్ సాయినాథ్ బాలరాజ్ క్రీడాకారుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

