కామ్రేడ్ ముకుందా చారికి విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
నమస్తే భారత్: పినపాక, : గుండాల గ్రామానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ ముకుందా చారి శనివారం రాత్రి అకాల మరణం చెందారు. విప్లవ పోరాటాల గడ్డ అయినా గుండాలలో జన్మించిన 1980లో విప్లవ రాజకీయాలకి ఆకర్షతులై సిపిఐ ఎంఎల్ ఉమ్మడి పార్టీలో చేరి కొంతకాలం పని చేశారు. ప్రజాపంద పార్టీలో చేరి పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఘన చరిత్ర తనది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు సాగు చేసుకుంటున్న పోడుభూములు నరికించడంలో తను క్రియాశీలక పాత్ర పోషించాడు. పోడు భూములు నరికించే క్రమంలో అనేక కేసులు జైలు జీవితం గడిపిన నాయకుడు. అలాగే గుండాల మండల ప్రజల మధ్య వైరుధ్యాలు అనేకం పరిష్కరించిన మంచి మనస్తత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారు. అలాగే కోపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ఉంటూ రైతులకు అనేక సేవలందించాడు. సొసైటీ చైర్మన్ గా ఏడు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు. గుండాల సొసైటీ చైర్మన్ గా పని చేస్తున్న క్రమంలో ప్రస్తుత కోపరేటివ్ కార్యాలయం నిర్మాణం ఆయన హయాంలోనే జరిగింది. ఆ తర్వాత పార్టీకి దూరమై సాధారణ వ్యక్తిగా గ్రామంలో పెద్దమనిషిగా మంచి వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తను ప్రజాప్రతినిధిగా ఉంటూ ఏ ఒక్క రూపాయి ఆశించకుండా నీతిగా, నిజాయితీగా మండల ప్రజలకు తన సేవలను అందించిన గొప్ప హృదయం కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తను విప్లవ పార్టీలో ఎంతో క్రమశిక్షణతో పనిచేసిన గొప్ప నాయకుడు. గ్రామంలో చిన్న ,పెద్ద అని తేడా లేకుండా కలగలుపుగా కలిసి ఉండే గొప్ప హృదయం కలిగిన వ్యక్తిగా జీవించారు. ముకుంద చారి భూమి కొలతల్లో దిట్ట. గుండాల గ్రామంలో ఎవరు భూమి కొనుగోలు చేసిన విక్రయించిన తన రాతలేని క్రయవిక్రయాలు అరుదు. అలాంటి మంచి పేరు ఉన్న ఆదర్శ విప్లవకారుడి హఠాత్తు మరణం గ్రామస్తులను బాధించింది. బతికినంత కాలం మచ్చలేని మనిషిగా జీవించి ఆకాల మరణం పొందడం బాధాకరం. ముకుంద చారి గారి మృతి పట్ల సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా గారు సంతాపాన్ని తేలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు..
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

