త్వరిత పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

 ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. 

త్వరిత పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

తేదీ, మే 05, 2025-
నమస్తే భారత్

నిర్మల్:-పట్టణంలోని
సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజల విజ్ఞప్తులు కలెక్టర్ స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూసమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల అంశాలపై ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్  అభిలాష్ అభినవ్. మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని, శాఖలవారీగా పెండింగ్‌ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా సిద్ధం చేయాలని, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో అవసరమైన మరమ్మత్తులు చేపట్టి సమయానికి పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులంతా సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణిలో 91005 77132 నంబరుకు కాల్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలని, వాట్సప్‌ ద్వారా దరఖాస్తులు పంపవచ్చని కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఐ మాక్స్ లైట్ల ప్రారంభం ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్  తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి  పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి  జన్మదిన వేడుకలు
మహిళా చట్టాలపై మహిళలు ఉండే ప్రదేశానికి వెళ్లి  అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షీటీమ్ బృందం  
కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.