పినపాక హెడ్ క్వార్టర్ లో ఇందిరమ్మ గృహాలు ఎక్కువగా మంజూరు చేయాలి
ఎమ్మెల్యే గారు ఈ పంచాయతీ పై దృష్టి సారించండి
నమస్తే భారత్: పినపాక : పినపాక మండలోని పినపాక గ్రామపంచాయతీలో ఎక్కువ ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుచున్నారు. గ్రామపంచాయతీ కూడా అభివృద్ధి బాటలోనే నడుస్తుండటం ఎక్కువగా గిరిజనులు, హరిజనులు ఎక్కువగా ఉన్న పినపాక మండల కేంద్రంలో సుమారు తొమ్మిది గృహాలు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అభివృద్ధికి గ్రామస్తులు సహకరిస్తూ అభివృద్ధి బాటలో నడవడానికి అధికారులకు తోడ్పడుతున్న ఈ పంచాయతీకి మరిన్ని ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల కు పంచాయతీ ప్రజలు ముక్తకంఠంతో కోరుచున్నారు. ఎక్కువగా ఈ పంచాయతీలో అంత బీదవారే ఉండడం మండల అధికారులకు అన్ని తెలిసి కూడా ఎందుకు తక్కువ గృహాలను మంజూరు చేశారో వారికే తెలియాలని గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి పినపాక పంచాయతీ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే సహకరించాలని గ్రామస్తులు కోరుచున్నారు.ఎన్నడూ లేని విధంగా 9 గృహాలు మంజూరు చేయటం సరికాదు: సిపిఎం పార్టీ నాయకుడు నిమ్మల వెంకన్నఎన్నడూ లేని విధంగా పినపాక మండల్ హెడ్ క్వార్టర్ అయి ఉండి కూడా 9 గృహాలు మంజూరు పట్ల గ్రామస్తుల నుండి వ్యతిరేకత చోటుచేసుకుందని సిపిఎం పార్టీ నాయకుడు నిమ్మల వెంకన్న అన్నారు. ఈ పంచాయతీలో ఏటి పర్సెంట్ బీదవారు గృహాలు లేకుండా నివాసముంటున్న సర్వే అధికారులు గానీ, ఇందిరమ్మ కమిటీ నెంబర్లు అధికారులకు ఎందుకు చెప్పలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అర్వతను బట్టి ఎక్కువ గృహాలను మంజూరు చేయాలని సిపిఎం పార్టీ తరపున కోరుచున్నానని నిమ్మల తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

