ఘనంగా పాలమూరు ఎంపీ శ్రీమతి డి కెఅరుణమ్మ జన్మదిన వేడుకలు.
బీజేపీ అధికార ప్రతినిధి వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు.
ముఖ్య అతిథి గా పాల్గొన్న నియోజక వర్గ ఇంచార్జ్ అందే బాబయ్య.
నమస్తే భారత్,షాద్ నగర్ మే04:షాద్‌నగర్ పట్టణంలో బీజేపీ అధికార ప్రతినిధి వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ నాయకురాలు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ షాద్‌నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ అందె బాబయ్య హాజరై, కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“డీకే అరుణ తెలంగాణలో మహిళా నాయకత్వానికి ప్రతీక. నిబద్ధత, దీక్ష, ప్రజల పట్ల ప్రేమతో ఆమె చేస్తున్న రాజకీయ ప్రస్థానం ప్రతి బీజేపీ కార్యకర్తకు ప్రేరణ. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభివృద్ధిలో ఆమె పాత్ర అనన్యసమానం. ప్రజా సమస్యలపై ఆమె గళమెత్తిన తీరు దేశ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మనం ఎంతో గర్వంగా, ఆనందంగా ఈ వేడుక జరుపుకుంటున్నాం.” అని అన్నారు.ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ, రిషి, హరి భూషణ్, కురుమయ్య, ప్రశాంత్, నర్సింలు, సురేష్, రఘు గౌడ్, కాశోజు శివ, ఎల్లయ్య, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
