పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం

పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం

నమస్తే భారత్ :-తొర్రూరు : పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన స్థానిక సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం సత్కరించింది. సోమవారం డివిజన్ కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో పది లో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ హర్ష, అక్షిత్, గంగోత్రి లను పాఠశాల చైర్మన్ ముత్తినేని సోమేశ్వరరావు, పాఠశాల కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్ లు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు.  సిద్ధార్థ హై స్కూల్.100 శాతం ఫలితాలతో తిరుగులేని పాఠశాలగా నిలిచింది. మొత్తం 17 మంది విద్యార్థులు పరీక్ష రాయగా దానిలో 10 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించగా, 7 మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా సాధించారు. మండలంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా చైర్మన్ సోమేశ్వర రావు, కరస్పాండెంట్ జయప్రకాష్ మాట్లాడుతూ...గత కొంతకాలంగా సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, వారు మంచి ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల కృషి,  తల్లిదండ్రుల సహకారం ఉందన్నారు. పాఠశాలలో విలువలతో కూడిన విద్య అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను వృద్ధిలోకి తీసుకురావడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు.

Views: 1

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఐ మాక్స్ లైట్ల ప్రారంభం ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్  తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి  పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి  జన్మదిన వేడుకలు
మహిళా చట్టాలపై మహిళలు ఉండే ప్రదేశానికి వెళ్లి  అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షీటీమ్ బృందం  
కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.