కమ్యూనిస్టు యోధుడు "గురుప్రసాదరావు"కు ఘన వీడ్కోలు

కమ్యూనిస్టు యోధుడు

* భారీగా తరలివచ్చిన సిపిఐ శ్రేణులు అభిమానులు
* జనసందోహం నడుమ గురుప్రసాద్ అంతిమ యాత్ర
* వైద్యవిద్యార్థుల పరిశోధనకు భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు అప్పగింత
* నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మంత్రి తుమ్మల
* ఉత్తమ కమ్యూనిస్టు మానవతావాది గురుప్రసాద్: కూనంనేని
అమరనేతల ఆశలకు అనుగుణంగా నడుచుకోవాలి: తుమ్మల

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: సిపిఐ సీనియర్ నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు యోధులు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆళ్ల గురుప్రసాద రావుకు సిపిఐ ప్రజాసంఘాల శ్రేణులు అభిమానులు న్యాయవాదులు ఘన వీడ్కోలు పలికారు. 93 ఎడ్ల గురుప్రసాద్ వృద్ధాప్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని తన బంధువుల గృహంలో మృతి చెందాగా అయన భౌతికకాయాన్ని ఆదివారం పార్టీ శ్రేణులు ప్రజల సందర్శనార్ధం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'కు తరలించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్యవర్గ సభ్యులు బి.అయోధ్యతోపాటు పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వై.ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో కూనంనేని మాట్లాడారు. గురుప్రసాదరావు ఉత్తమ కమ్యూనిస్టు అని తన తుది శ్వాస వరకు ప్రజా సేవకే అంకితమయ్యారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించారని ఈ ప్రాంతంలో పార్టీ నిర్మాణం విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేశారని అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్ది  కమ్యూనిస్టు పార్టీకి అందించారన్నారు. న్యాయవాదిగా పేదలపక్షం వహించాడని మానవతా వాదిగా నిస్వార్ధంగా పేదవర్గాల సేవలందించాడని అయన మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో  కొత్తగూడెం పరిసర మండలాల్లో రాజాకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి గురుప్రసాద్ అని ప్రజాఉద్యమాలతో కమ్యూనిస్టు పార్టీ  ప్రతిష్టను జిల్లా ప్రతిష్టను పెంచిన వ్యక్తి గురుప్రసాద్ అని ఎలాంటి పదవులను ఆశించకుండా కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారని అయన మృతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలను తీరని లోటని అమర నేతల ఆశయాల సాధన దిశగా ప్రతిఒక్కరు కృషిచేయాలని అన్నారు. అనంతరం శేషగిరిభవన్ నుంచి కొత్తగూడెం వైద్య కళాశాల వరకు జనసందోహం నడుమ అంతిమయాత్ర జరిగింది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గురుప్రసాద్ భౌతికకాయాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధన నిమిత్తం కొత్తగూడెం వైద్య కళాశాలకు అప్పగించారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, తాటి వెంకటేశ్వర్లు, పాకలపాటి పెద్దబ్బాయి, ప్రముఖ వైద్యులు రమేష్ బాబు, రామ్మోహనరావు, పట్టాభి, లాయర్స్ అసోసియేషన్ నాయకులు లక్కినేని సత్యనారాయణ, రాధాకృష్ణ, కోటం రాజు, ఎల్లంకి వెంకటేశ్వర్లు, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, జి వీరాస్వామి, వి.మల్లికార్జున్ రావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, వి.పూర్ణదందర్ రావు, కందుల భాస్కర్, భూక్యా దస్రు, గెడ్డాడు నగేష్, కొమారి హన్మంతరావు, మునిగడప వెంకటేశ్వర్లు, రాహుల్, ఫహీమ్, పొలమూరి శ్రీనివాస్, కె.రత్నకుమారి, సిపిఎం నాయకులు లిక్కి బాలరాజు తదితరులు వున్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

16,01856 లక్షల కల్యాణ లక్ష్మి, 12,30,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం   16,01856 లక్షల కల్యాణ లక్ష్మి, 12,30,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం  
నమస్తే భారత్: అశ్వాపురం : అశ్వాపురం మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అశ్వాపురం మండలానికి చెందిన 16 మందికి 16,01856, లక్షల విలువ గల కల్యాణ...
అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి యస్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత: ధన్వాడ ఎస్సై రాజశేఖర్
మేము సైతం మిత్రమండల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు...
మక్తల్ పట్టణంలో షాహిద్ భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ  కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలి.రామాంజనేయులు సిపియంయల్ నాయకులు
కమ్యూనిస్టు యోధుడు "గురుప్రసాదరావు"కు ఘన వీడ్కోలు
కోస్గి బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు