ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి యస్.
---బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అనంతరం క్షేత్ర స్థాయిలో బాధితుల గ్రామాలకు వెళ్లి విచారించి తదుపరి చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పి గారు తెలిపారు. భూతగాధలకు సంబంధించిన ఫిర్యాదులను రెవెన్యూ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేసి త్వరితగతిన కేసులను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఎస్పీ ఆఫీస్ కి, పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదు దారులు మధ్యవర్తులని తీసుకురావద్దని బాధితులు మాత్రమే వచ్చి ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదుకు సంబంధించిన విషయాలు తెలపాలని ఎస్పి తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

