ఘనంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భగీరథ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఆనాడు భగీరథుడు అవిశ్రాంతంగా కృషి చేసి నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయుడయ్యారని కొనియాడారు. ఏదైనా కష్టమైన కార్యం సాధించాలంటే మహర్షి భగీరథుడి కృషిని ప్రస్తావిస్తూ, ఆ స్పూర్తితో ముందుకు సాగాల్సిందిగా పెద్దలు సూచిస్తారని గుర్తు చేశారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో బి. సి. అభివృద్ధి శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డిపిఆర్ఓ ఎం.ఏ.రషీద్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సగర సంఘం నాయకులు మల్లికార్జున్, నర్వ చెన్నయ్య సాగర్, విజయ్ సాగర్, నిడుగుర్తి శంకర్, ధన్వాడ శంకరయ్య, నర్వ రామకృష్ణ, కడేచూర్ అంజి, మన్నె నారాయణ, ఆనంద్, బుసన్న, రాజబాబు, సురేందర్,బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
