ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి ఉంచిన కవర్ లేచిపోగా., నిలువెత్తు విగ్రహం హైవే పై కనిపించడంతో, వాహనదారులు, ప్రజలు, ఆసక్తిగా తిలకిస్తూ. పోటోలు తీసుకుంటున్నారు. ఈయన ఎవరంటూ మరికొందరు వారి చరిత్రను అడిగి తెలుసుకుంటున్నారు.మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవసభలో అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ..ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి రాజకీయచరిత్ర ఘనమైనదని, మాజీ ప్రధాని పివి నర్సింహారావు వంటి అనేక మందికి ఆయన గురుతుల్యులని గుర్తుచేసారు.., అలాంటి నేతను భవిష్యత్తు తరాలు మరిచిపోకుండా విగ్రహం, పార్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ప్రస్తుతం ఆ..పనులు పూర్తి అయ్యి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది తొలిగిన కవర్ ను త్వరగా కప్పి అదేమాదిరి వీలయినంత త్వరగా అధికారికంగా ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
