నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..
ఏకకాలంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిది లో నాఖాబంది : జిల్లా ఎస్పి డా. జానకి షర్మిల ఐపిఎస్
తేదీ, 03.05.2025.
నమస్తే భరత్
నిర్మల్ జిల్లా ఎస్పి డా. జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా ఎ.ఎస్పి. అవినాష్ కుమార్ ఐపిఎస్ మరియు నిర్మల్ ఏ.ఎస్పి రాజేష్ మీన ఐపిఎస్ ల పర్యవేక్షణలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పోలీస్ సిబ్బంది మరియు జిల్లా ఎఅర్ సిబ్బంది తో శనివారం సాయత్రం ఒకేసారి నాఖాబంది నిర్వహించారు . సరియైన ఆధారాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు పట్టుకోవటం జరిగింది.ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడం ఒకటైతే మరొకటి ర్యాష్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్ లేని వాహనాల వాళ్ళ జరిగే ప్రమాదాలలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఎటువంటి ఆర్దిక సహాయం అందదు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీసులు ఎస్పి గారి ఆదేశాలతో ప్రతిరోజు నగరంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. అన్ని లాడ్జ్ లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రనే మరియు రోడ్డు ప్రమాదాల నియంత్రనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఒకేసారి నాఖబంది నిర్వహించటం జరిగింది. ఈ తనిఖీల్లో అవినాష్ కుమార్ ఐపిఎస్, రాజేష్ మీన ఐపిఎస్, జిల్లాలోని ఇనస్పెక్టర్ లు, ఎస్ఐ లు , ప్రొబేషనరీ ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

