పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము

On
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము

 

నారాయణపేట్ జిల్లా / ప్రజాపక్షం

మరికల్  పోలీసులు టౌన్ లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, కర్ణాటక రాష్ట్రం నుండి షాద్‌నగర్ వైపు వెళ్తున్న డిసీఎం వాహనంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా గోవులను  తరలిస్తున్నందున మరికల్ పోలీసులు పట్టుకొని తనిఖీ చేసి విచారించగా డీ సీఎం  వాహనంలో 8 ఎద్దులు, 5 గోవులు, 1 గేదె ఉన్నట్లు గుర్తించమని వాటికి ఎలాంటి పర్మిషన్ లేదు అని కర్ణాటక రాష్ట్రం గంగావతి గ్రామానికి చెందిన వాహన డ్రైవర్ రామన, యజమాని ఖలీం లపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని మరికల్ ఎస్‌ఐ రాము తెలిపారు.పట్టుబడిన గోవులను నర్వ మండలంలోని శంకర్‌లింగం గోశాలకి తరలించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గోవులను ఎలాంటి అనుమతి లేకుండా తరలించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Tags

Share On Social Media

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise