తల్లిదండ్రుల పాలిట భారంగా పరిణమించిన మణుగూరు మండలం ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతి అధిక ఫీజుల వసూళ్లు నివారించాలి
మండల విద్యాశాఖ అధికారిణి స్వర్ణ జ్యోతి కి ,తహశీల్దార్ అద్దంకి. నరేష్ కి వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) మణుగూరు; తల్లిదండ్రుల పాలిట భారంగా పరిణమించిన మణుగూరు మండలం ప్రైవేట్ పాఠశాలల్లో పదవ తరగతి అధిక ఫీజుల వసూళ్లు నివారించాలని కోరుతూ మణుగూరు మండల విద్యాశాఖ అధికారిణి స్వర్ణ జ్యోతి కి, మండల తహశీల్దార్ అద్దంకి నరేష్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మండలంలోని ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీజుల పేరుతో ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరి నుండి టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు 2500, ఎస్ఏ ఎగ్జామ్ ఫీజు పేరుతో మరో 1500 మొత్తం 4000 రూపాయల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు.విద్యాశాఖ అధికారులు స్పందించి గవర్నమెంట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఆదేశాను సారం ప్రభుత్వ పాఠశాలలో కట్టించుకుంటున్న విధంగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవాలని ఆ మేరకు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలకు తగు ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కోరినట్లు ఆయన తెలిపారు అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యాశాఖ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
