కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ పై సమీక్షా సమావేశం.
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) రుద్రంపూర్ సింగరేణి; ఈ వార్షిక సంవత్సరం కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ కొత్తగూడెం ఏరియాకు నిర్ణయించడమైనది అందులో భాగంగా తేదీ. 19.11.2025 (బుధవారం) న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు గారి అధ్యక్షతన జిఎం గారి ఛాంబర్ నందు కార్పొరేట్ వెల్ఫేర్ వింగ్ మరియు స్పోర్ట్స్ అధికారులు, కొత్తగూడెం ఏరియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిఎం గారు మాట్లాడుతూ కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ నిర్వహణ మన కొత్తగూడెం ఏరియా ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్, రుద్రంపూర్ నందు నవంబర్ 28, 29, 30 వ తేదీలలో నిర్వహించుటకు అనుమతులు ఇచ్చిన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. బలరాం, ఐఆర్ఎస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, కంపెనీ లెవెల్ లో జరుగుతున్న ఈ కబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరల మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవెల్ క్రీడా పోటీలను నిర్వహించుటకు అనుమతులు పొందేలా ఈ క్రీడలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ నిర్వహణకు అవసరమైన వసతులను (గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్స్, క్రీడలను ఆడుటకు వచ్చిన క్రీడాకారులకు వసతి గృహము, భోజన వసతి మరియు కబడ్డీ కోర్ట్ ప్రిపరేషన్, సాయంత్రం సమయాలలో కూడా నిర్వహించుటకు ఫ్లడ్ లైట్ సదుపాయాము మరియు ఇతర కబడ్డీ నిర్వహణకు కావలసిన పనులను గూర్చి సంబంధిత అధికారులచే సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించి నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఎటువంటి లోటు పాటులు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిఎం గారితో పాటు ఎస్.ఓటు జిఎం జీవి కోటిరెడ్డి, డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం (ఐఈ) ఎన్. యోహాన్, డిజిఎం (ఈ&ఎం) ఏరియా వర్క్ షాప్ జె. క్రిస్టఫర్, కార్పొరేట్ నుండి డి.జి.ఎం (పర్సనల్) బి.శివకేశవరావు, ఎస్ఓఎం ( ఎన్విరాన్మెంట్) టి సత్యనారాయణ, మెడికల్ సూపర్డెంట్ ఏం పరశురాములు, సివిల్ అధికారి రాజారామ్, డివైపిఎం సునీల్, సీనియర్ పిఓ మజ్జి మురళి, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంసీ పాస్నైట్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
