బచ్చోడు లో సర్పంచ్ అభ్యర్థిగా తొలి నామినేషన్ దాఖలు చేసిన తిమ్మిడి హనుమంతరావు

On
బచ్చోడు లో సర్పంచ్ అభ్యర్థిగా తొలి నామినేషన్ దాఖలు చేసిన తిమ్మిడి హనుమంతరావు

 

నమస్తే భారత్:-తిరుమలపాలెం


సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా) ఖమ్మం జిల్లా నాయకులు తిమ్మిడి  హనుమంతరావు బచ్చోడు గ్రామ సర్పంచిగా సోమవారం నాడు తొలి నామినేషన్ ఎన్నికల  రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తిమ్మిడి హనుమంతరావు గత 40 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలలో అలుపెరుగని పోరాటం చేస్తూ రైతాంగ సమస్యలపై, వ్యవసాయ కూలీల సమస్యలపై, బోదకాలు సమస్యలపై, బచ్చోడు గ్రామ అభివృద్ధి కి, గ్రామం లో పేరుకుపోయిన సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన గుర్తింపు కలిగిన నాయకుడు తిమ్మిడి హనుమంతరావు అని సిపిఎంఎల్ మాస్ లైన్ తిరుమలయపాలెం మండల నాయకులు ఎన్నబోయిన శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా అన్నారు.తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడనీ ప్రజలు బచ్చోడు గ్రామ సర్పంచిగా గెలిపించాలని, బచ్చోడు మండలం సాధించేవరకు పోరాటం చేస్తారని నామినేషన్ వేసిన సందర్భంగా శ్రీనివాసరావు అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి తిమ్మిడి హనుమంతరావు. వెన్న బోయిన శ్రీనివాసరావు. అంగిరేకుల లింగయ్య. తిమ్మిడి వెంకన్న. వెన్నబోయిన రేణుక. అనంతగిరి భూమయ్య తిమ్మిడి మహేష్. అడ్వకేట్ తిమ్మిడి మురళీకృష్ణ. నవీన్. అశ్విని. సుభద్ర.స్పందన, రఘుబాబు. తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise