కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

On
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

 

నమస్తే భారత్ :-తొర్రూరు

కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రిగా దేశంలో గరీబీ హటావో అనే నినాదంతో దేశంలో ఉన్న ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చిన ఐరన్ లేడీ ఇందిరా గాంధీ అని కొనియాడారు.ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పెదగాని సోమయ్య,సీనియర్ నాయకులు చాపల బాపురెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి, నాయకులు భూసాని రాము,నర్కూటి గజానంద్,వెంకట్ రెడ్డి,దేవేందర్ రాజు, సహదేవ్,తోట అశోక్, మహేష్ యాదవ్, పరుశురాములు, గిరిధర్, అన్వేష్,బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Latest News

Advertise