కోటి మహిళలకు కోటి చీరలు – రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పండగ వాతావరణం..

On
కోటి మహిళలకు కోటి చీరలు – రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పండగ వాతావరణం..

పారదర్శకతతో ఇందిరమ్మ చీరల పంపిణీ – కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు 


 వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశం 

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) కొత్తగూడెం ;  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, గౌరవం మరియు ఆర్థిక స్వావలంబనను బలపరచడంలో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నేతృత్వంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులతో రాష్ట్రవ్యాప్త వీడియో కాన్ఫరెన్స్ బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సిఎం సలహాదారు వేణు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళలకు కోటి చీరల పంపిణీని ప్రారంభించిందని తెలిపి, ఈ కార్యక్రమం తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలవాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించాలని, మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చీరల పంపిణీని పండగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. మహిళల ఆర్థిక పురోగతికి ఆర్టీసీ ఉచిత ప్రయాణం, యూనిఫారమ్ కుట్టే బాధ్యతలు, ఇందిరా మహిళా శక్తి బజార్, అమెజాన్‌తో ఒప్పందాలు జరుగుతున్నాయని మహిళలు తయారు చేసే వస్తువులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సెర్ప్ అధనపు డి ఆర్ డి ఓ నీలేష్,డి పి ఓ అనూష, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశ మందిరంలో మహిళా సంఘాల సభ్యులు ముఖ్యమంత్రి ప్రసారాన్ని వీక్షించారు. 

 అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. 
జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో, సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్హత గల మహిళకు చీర అందేలా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పంపిణీ ప్రక్రియను నిష్పాక్షికంగా అమలు చేయాలని, ఎలాంటి తప్పిదాలు, ఆలస్యాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల్లో బౌతిక ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, రశీదుల యాజమాన్యం పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రత్యేక కౌంటర్లు,  సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.

  ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుండి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 8 వరకు పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు


అనంతరం ‘జల్ సంచయ్ – జన్ భాగీదారీ’ కార్యక్రమంలో జిల్లా సాధించిన జాతీయ అవార్డు సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలను మహిళ సంఘ సభ్యులు సత్కరించారు.

Tags

Share On Social Media

Latest News

Advertise