భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.. 

On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.. 

 

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జాతీయమహిళా కార్యక్రమాన్ని నిర్వర్తించాము మహిళలకు ముగ్గుల పోటీ, మరియు గోరింటాకు పోటీ మహిళలకు విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెల్లా అరుణ సేఫ్టీ ఉమెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నరు.

 నేడు సమాజంలో మహిళలకు భద్రత లేదని చిన్నపిల్లల దగ్గర నుంచి వారి వరకు ప్రతి ఒక్కరూ వారికి వారే రక్షణను కల్పించుకోవాలని మనోధైర్యంతో ఉండాలని ధైర్యం కోల్పోవద్దని ఆలకి సపోర్టింగ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ భరోసా ఉందని ఒక మహిళ ఒక మహిళ చదవడం వల్ల కుటుంబంతో పాటు సమాజంలో కూడా ఒక మంచి స్థానం ఉంటుందని మహిళల ముందుకు రావాలని ప్రతి రంగంలో మహిళలు రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణయతగా చించిపెళ్లి హై స్కూల్ సబిత ప్రధాన ఉపాధ్యాయురాలు పాల్గొని అందంగా గోరింటాకు పెట్టిన విజేతులను నిర్ణయించారు.

 ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు మణి మృదుల, గ్రంథ పాలకులు మధుబాబు అనే రుక్మిణి సిబ్బంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాఠకులు పాల్గొన్నారు తదనంతరం 108 వ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు  ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags

Share On Social Media

Latest News

Advertise