స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాధికారం కొరకై ఏర్పడిన పార్టీ. భారత్ లేబర్ ప్రజాపార్టీ,   

On
స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాధికారం కొరకై ఏర్పడిన పార్టీ. భారత్ లేబర్ ప్రజాపార్టీ,   

 

 తెలంగాణ లో ప్రచార యాత్రకు సిద్ధమవు తున్న పార్టీ. 

 భారత్ లేబర్ ప్రజా పార్టీ, అధ్యక్షులు అజ్మీరా లక్పతి... 

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 19_) కొత్తగూడెం పాల్వంచ;  స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాధికారం కొరకై ఏర్పడిన పార్టీ. భారత్ లేబర్ ప్రజాపార్టీ, పేద, ఐదుగు, బలహీన వర్గాలు, కార్మికుల, కర్షకుల కోసం ఆవిర్భవించిన పార్టీయే భారత్ లేబర్ ప్రజాపార్టీ ఇక నుండి మీ కష్టాలకు మీ భాదలకు: అండగా వుండేదే భారత్ లేబర్ ప్రజాపార్టీ. ఎస్.సి., ఎస్.టి., బి.సి, మైనార్టీ, అణగారిన కులాల ఆకలి, అనారోగ్యం, కన్న బిడ్డలను కూడా కాపాడుకోలేని దుస్థితి చూసాము, వాళ్ళ కష్టాన్ని దోచుకునే దోపిడిదారులు, దళారులను, మోసాగాళ్ళను చూసాము, దిక్కుతోచని స్థితిలో ఉన్న అమాయకుల అర్థనాదాలు చూసినాము, వారి కష్టాలను కన్నీళ్ళకు కారణాలు ఏమిటని ఆలోచించాము. బాధలు ధరించలేక కార్మికులు, కర్షకులు, ఇతర శ్రమ జీవులు లెగించి ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు: క్రూరంగా ఎస్.సి., ఎస్.టి., బి.సి, మైనార్టీ, అణగారిన కులాలను పూర్వము నుండి అణచివేస్తున్నారు. వేదికపైకి వచ్చి సామాజిక, రాజకీయ, ఆర్థిక మానవత్వం కోసం ఆందోళన చేయాలి. శ్రమ చేసే శ్రమ జీవులను అంటరానితనం అనే హద్దులో బంధించి ఉంచినది. యువతి యువకులు... రాజ్యాధికార దిశలో మనము ముందడుగు వేసి రాజ్యాధికారం సాధించుకుంటేనే మన జాతులు బ్రతుకగలవు.


రాజ్యాధికారం సాధించడానికి బలమైన పునాదులు అవసరము. అవి 1) విద్య, 2) ఉద్యోగము, 3) భూమి, 4) అక్షరాస్యత, 5) ఆత్మగౌరవం అనే పునాదులపై సమాజము నిర్మించగలిగితే మహాత్మ జ్యోతిరావ్ (పూలే, డా॥ బి.ఆర్ అంబేద్వర్ ఛత్రపతి సాహుల్ మహారాజ్ వంటి మహనీయుల కృషి ఫలితముగా ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనార్టీ, అణగారిన కులాలకు రాజ్యాంగపరంగా ప్రజా ప్రాతినిధ్య చట్ట సభలలోనూ, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు లభించాయి. ఎస్.సి., ఎస్.టి., బి.సి.. చైనార్ట, అణగారిన కులాలు అనేక పార్టీలలో సభ్యులుగా ఉంటూ ఆయా పార్టీ పెద్దలు, పాలకులు ఇచ్చే పదవులు పొందుచున్నాడు. వారి గతమును మరచి, వాళ్ళ స్వార్ధంలో కొందరు రాజకీయ భానిసలుగా మార్చి ఇదే మీ జీవితము అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనార్టీ, అణగారిన కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందా, లేదా! ఒక్కసారి ఆలోచించండి.

 దేశ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించటానికి సిద్ధంగా ఉన్న పార్టి భారత్ లేబర్ ప్రజా పార్టీ.

ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి. సామాజిక, ఆర్ధిక రంగాలలో సమానంతరం కోసం పోరాడాలి.

భారతదేశ సంపదలో తమ జనాభా ప్రాతిపదికన వాటా సంపాధించిన రోజే ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనార్టీ, అణగారిన కులాలు నిజంగా ప్రగతి సాధిస్తారు.

మన కష్ట నష్టాలను భరియించేది మనమే. మనల్ని అదుకునే నాయకుడు ఒక్కడు కూడా లేదు. ఒక్క పార్టీ కూడా లేదు. గత 100ల సంవత్సరాలనుండి చూస్తూ భరిస్తున్నాము, పేద, బడుగు, బలహీన వర్గాలకు ఒక్కరోజు తింటే మరొకరోజు తిండిలేని పరిస్థితులు ఉన్నాయి. కొందరు నాయకులు మాయ మాటలు గారడి, మాటలతో పబ్బం గడుపుకుంటూ మోసాలకు పాల్పడుతూ మనల్ని మోసం చేస్తున్నారు..

ప్రతి 5 సంవత్సరాలకి ఇవే తీయటి మాటలు చెబుతూ మన ఓటును వాళ్ళు దోచుకుంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళు మనకు ఈ కష్టాలు. వాళ్లు మోసం చేసుకుంటూ పోతూ ఉంటే మనం చుస్తూ ఊరుకుందామా...! ఇకనైన ఆలోచించండి మార్పును స్వాగతించండి మీ మార్పు కొరకై మనందరి మంచి కోసం భారత్ లేబర్ ప్రజాపార్టీ ఏర్పడింది..

ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది కొందరు నాయకులేనా.. ఎన్.సి., ఎస్.టి., బి.సి., మైనార్టీ, అణగారిన కులాలు ఉన్నా వీ పరిపాలిస్తూ ఉన్నారు. ఇక నుండి మార్పు తెచ్చుకుందాము. మన పరిపాలనను మనమే పాలించుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల జనాభా ఉన్న పరిపాలించేది కొందరు నాయకులేనా..... నాలుగున్నర కోట్ల జనాభా ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు.... ఇలాగే భానిసలుగా ఉందామా... 5 సంవత్సరాలకు వచ్చే మన ఓటుని అమ్ముకుందామా... ఇకనైన మార్పును తెచ్చుకుందాం.... మన బ్రతుకులకు మార్గం భారత్ లేబర్ ప్రజాపార్టీ.

భారత్ లేబర్ ప్రజాపార్టీ మీ మార్పు కొరకె

_రాష్ట్ర కమీటి, జిల్లా కమీటీలు మరియు గ్రామ కమిటీల నియామకం కొరకై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. చేరండి... చేర్పించండి... చేయూతనివ్వండి... వివరాలకై సంప్రదించండి. భారత్ లేబర్ ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అజ్మీరా లక్పతి.. 9848340097,

Tags

Share On Social Media

Latest News

Advertise