పురుషోత్తపట్నంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గుండాల ఎంపీటీసీ
నమస్తే వార్త భద్రాచలం ఆర్ సి రిపోర్టర్ కోట దిలీప్.:
భద్రాచలం పట్టణానికి చెందిన నేతాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పురుషోత్తపట్నం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీటీసీ గొంగడి వెంకట రామిరెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గొంగడి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన నేతాజీ హాస్పిటల్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు గడ్డం మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలోని నిరుపేద ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, ఆధునాతన వైద్య సదుపాయాలతో భద్రాచలం పట్టణంలో నేతాజీ హాస్పిటల్‌ను స్థాపించినట్లు తెలిపారు. తమ హాస్పిటల్‌లో లాప్రోస్కోపిక్ సర్జరీలను అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని పేర్కొన్నారు. లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయించుకోవడం వలన తక్కువ నొప్పి, తక్కువ కోత, త్వరగా కోలుకోవడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు తమ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 100 మందికి ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తమ హాస్పిటల్‌లో 24 గంటలు ఆర్థోపెడిక్ మరియు లాప్రోస్కోపిక్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ శ్రీనివాసరావు గడ్డం తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లంపాటి నర్సింహారెడ్డి మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
