ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం

On
ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం


ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేపట్టాలి
21న భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర ప్రచార జాతాలు 
యువతను చైతన్యవంతం చేసేవిధంగా జనసేవాదళ్ క్యాంపులు నిర్వహించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 18_) కొత్తగూడెం : ప్రజలభాగస్వామ్యంతో సిపిఐ శాతవాసంతోత్సవాలను, డిసెంబర్ 26న ఖమ్మం నగరంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో మంగళవారం జరిగిన కొత్తగూడెం టౌన్, సుజాతనగర్, జూలూరుపాడు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల పరిధిలోని జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, ముఖ్యుల సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సిపిఐ వంద సంవత్సారాలు పూర్తి చేసుకుంటున్న సందర్గంగా జాతీయ స్థాయి ముగింపు వేడుకలు, బహిరంగ సభ ఖమ్మం నగరం వేడుకవుతోందని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు జిల్లా నుంచి లక్ష మందిని తరలించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వందేళ్లుగా పేద, బడుగు, బహీన వర్గాలకు, రైతులకు, కార్మికవర్గానికి సిపిఐ అందిస్తున్న సేవలు, ప్రజా పోరాటాలను ప్రజలకు వివరించేవిధంగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఖమ్మం నగరంలో ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు, 40దేశాలకు చెందిన కమ్యూనిస్టు ప్రతినిధులు పాల్గొంటున్నారని సాబీర్ పాషా తెలిపారు.  ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్లో ప్రారంభమైన రెండు రాష్ట్ర ప్రచార జాతాలు ఈ నెల 21న జిల్లాలో ప్రవేశిస్తాయని, జిల్లాలోని పలు మండలాల్లో ఈ ప్రచారజాతాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  బహిరంగ సభ సందర్బంగా జిల్లా వ్యాపితంగా పది కేంద్రాల్లో జనసేవాదళ్ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని, మూడు వేల మంది యువకులను జనసేవాదళంగా సిద్ధంచేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్, గనిగళ్ల వీరాస్వామి, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, భూక్యా దస్రు, ఎస్ కె ఫహీమ్, మండల కార్యదర్శులు గుండెపిన్ని వెంకటేశ్వర్ రావు, దీటి లక్ష్మీపతి, కొమారి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise