ఇది ముమ్మాటికీ బూటకువు ఎన్ కౌంటరే
-ఏక పక్షంగా కాల్చి చంపారు.
కేంద్రం నరహత్యలకు పాల్పడుతోంది.
- ఈ ఎన్ కౌంటర్లపై న్యాయవిచారణ జరపాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 18_) కొత్తగూడెం : మావోయిస్టు కేంద్రమిటీ సభ్యుడు మాడవి హిడ్మాతో పాటు మరో ఐదుగురిది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటరే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ కౌంటర్ల పేరుతో నరహత్యలకు పాల్పడుతోందని ఆవేదనవ్యక్తం చేశారు. అసలు ఎన్ కౌంటర్ అంటే ఇరు పక్షాలు ఎదురెదురుగా కాల్చుకునేది అని,కానీ ప్రస్తుతం హిడ్మా ఎన్ కౌంటర్ చూస్తుంటే వారిని పట్టుకుని తెచ్చి కాల్చి చంపినట్లుగా ఉందన, దానికి కట్టుకథ అల్లి ఎన్ కౌంటర్ అనే అందమైన పేరు పెడుతున్నారని మండిపడ్డారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ పంతం పట్టి మరీ కాల్చి చంపుతున్నారని, 2026 మార్చి నెలాఖరు నాటికి మావోయిజాన్ని లేకుండా చేస్తామని చెప్పిన మోడిషాలు వారి చెప్పిన మాటకు సార్థకత చేకూరేలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్ కౌంటర్ పాటు ఇప్పటి వరకు చోటు చేసుకున్న వలు ఎన్ కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించి న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలని
డిమాండ్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించడం సరైంది కాదని, ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే మంచిదే కాదనీ, ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీస అవకాశం ఇవ్వకుండా చేయడం మంచివద్దతి కాదన్నారు. దేశంలో బిజేపి అరాచక పాలన సాగిస్తోంది, గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మొట్టికాయ వేశారని, బిహార్ ఎన్నికల్లో ఓట్ల గల్లంతుకు పాల్పడటంతో పాటు అయినవారి ఓట్లను కలుపుకుని విజయ సాధించినట్లు చెప్పుకుంటున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, ఇది జంగిల్ రాజ్ పరిపాలనలా ఉందని యద్దేవా చేశారు. ఇప్పటికైనా బూటకపు ఎన్ కౌంటర్లు, మత గర్షణలకు, మతాలు, కులాల పేరుతో విభజనలకు స్వస్తి వలికి దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి శ్రీనివాస్, జి వీరస్వామి, చండ్ర నరేంద్ర, వంట్టికొండ మల్లికార్జునరావు, గుండెపిన్ని వెంకటేశ్వరరావు, వంగా వెంకట్, రత్నకుమారి, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
