అడ్డగూడూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్లను ఆకస్మిక తనిఖీ చేసిన డి.ఈ ఎం శ్రీరాములు
నమస్తే భారత్ :-అడ్డగూడూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం మండలంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఆసరుగా నిలుస్తున్నాయి.ఇందిరమ్మ ఇండ్లు మండలంలోని శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎంపికైన లబ్ధిదారులు ముమ్మరంగా చేపడుతున్నారు.ఈ ఏడాది ఆగస్టులో లబ్ధిదారులు ముగ్గులు పోసుకొని నిర్మాణాలు పిల్లర్లు ఏర్పాటు చేసుకొని బేస్మెంట్ వరకు లెవెల్ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతూ.స్లాబ్ లేవల్ వరకు వచ్చాయి.(డి)రేపాక,గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ముక్కెర్ల సైదులు స్లాబు వేసుకొని ఇల్లు పూర్తి చేశారు. కంచనపల్లి గ్రామంలో గిరగాని దుర్గమ్మ స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేసిన వారితో డి.ఈ ఎం శ్రీరాములు మాట్లాడుతూ.మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సూచనలు ఇచ్చారు.లబ్ధిదారులు 800 నుండి 900 స్లాబ్ ఏరియా చదరపు అడుగులు పరిమితం చేయాలన్నారు.1000 చదరపు అడుగులు మించి చెల్లింపులు ఉండవని డి.ఈ శ్రీరాములు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లను ఎంత తొందరగా పూర్తి చేస్తారో అంత త్వరగా బిల్లులు వస్తాయని హౌసింగ్ డి.ఈ లబ్ధిదారులకు సూచనలు ఇచ్చారు.గ్రామాలలో పర్యటిస్తూ..ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. హౌసింగ్ ఏఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందుబాటులో ఉండి ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం ఫోన్ చేస్తే సమాచారం అందిస్తూ విధి నిర్వర్ణను బాధ్యతగా నిర్వహిస్తూ..లబ్ధిదారుల ఇంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఇంటి నిర్మాణం త్వరగా చేయించే విధంగా లబ్ధిదారులకు అందుబాటులో ఉంటానని అడ్డగూడూరు హౌసింగ్ ఏఈ గోపిసింగ్ తెలిపారు.
