సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి సీఎం రావడం హాస్యాస్పదం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ధి సుదర్శన్ రెడ్డి
ఖానాపురం ,నవంబర్ 29 (నమస్తే భారత్ ) :
గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి ,జిల్లా , నియోజకవర్గం తిరిగే దౌర్భాగ్యస్థితి రావడం హాస్యాస్పదమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ధి సుదర్శన్ రెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఖానాపురం మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి నర్సంపేటకు ముఖ్యమంత్రి రావడం హాస్యాస్పదం అని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలో అడుగుపెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదని గతంలో ప్రకటించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఏ ఒప్పందంతో నర్సంపేటలో అడుగుపేడుతున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు.
రైతులకు, మహిళలకు,వృద్ధులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చినంకనే ముఖ్యమంత్రి నర్సంపేటలో అడుగుపెట్టాలన్నారు. రెండు సంవత్సరాలుగా నర్సంపేటలో ఆగిన అభివృద్దికి బాధ్యులెవరో చెప్పాలన్నారు.
రెండు సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గం లోని పట్టణాలను, గ్రామాలను ఎమ్మెల్యే నాయకత్వంలో స్థానిక నాయకులు విధ్వంసం చేస్తున్నారన్నారు.బీఆర్ ఎస్ పార్టీ స్థానిక నాయకత్వానికి,పార్టీ కార్యకర్తలకు భయపడి, గెలవలేమని ముఖ్యమంత్రితో నర్సంపేటలో వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికలలో ప్రచారం చేపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నర్సంపేట వచ్చే సందర్భంగా నర్సంపేట ప్రజల పక్షాన నేను అడుగుతున్నాను ఈ రెండు సంవత్సరాల కాలంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏం ఓరగబెట్టిందో ప్రకటన చేసినాకనే నర్సంపేటలో అడుగు పెట్టాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు అని అన్నారు. 60 వేల రూపాయలు అయింది 24 నెలల కాలంలో ఈ 60 వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు అకౌంట్లో వేసిన తర్వాతనే నర్సంపేట గడ్డమీద అడుగు పెట్టాలి.రైతులకు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశావు పాకాల అభివృద్ధి పనులను కాకుండా చేశావు తెలంగాణ రైతులను, నియోజకవర్గ రైతులను బోనస్ పేరుతో బోగస్ మాటలు చెప్పి మోసం చేశారన్నారు.
రైతు భరోసా,రుణమాఫీ, బోనస్ లో రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మహిళలకు ,యువకులకు,విద్యార్థులకు నిరుద్యోగులకు, వృద్ధులకు ఇచ్చిన హామీలు అమలు చేసిన తరువాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఓట్లు అడగాలి
రైతులను, రైతు కూలీలను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు, రైతు భరోసాను ఎగబెట్టారు, వడ్లకు బోనస్ ఇవ్వలేదు.
అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో రైతులు మహిళలలు చిన్నపిల్లలు కుటుంబాలతో సహా నెలల తరబడి క్యూ లైన్ లో నిలబడి అనేక ఇబ్బందులు పడ్డారు. సరైన సమయంలో రైతులకు యూరియా అందక పంటల దిగుబడి తగ్గి రైతులు పంట నష్టపోవడం జరిగింది. పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎకరాకు 25000 ఇవ్వాలి. గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి జిల్లా నియోజకవర్గ తిరిగే దౌర్భాగ్యస్థితికి వచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ , మండల పార్టీ అధ్యక్షుడు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,మాజీ ఎంపీపీ,మండల పార్టీ బాధ్యులు, సొసైటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు,మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు, మహిళా సంఘం అధ్యక్షురాలు యూత్ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
