స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాగం సిద్ధం

On
స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాగం సిద్ధం

 

*జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో మొదటి విడతలో160 గ్రామపంచాయతీలలో 1402 వార్డు స్థానాలకు నామినేషన్లు

ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్ల పరిశీలన


 పాపన్నపేట,నవంబర్,26, (నమస్తే భారత్ ప్రతినిధి)

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట, టేక్మాల్  ఎంపీడీవో కార్యాలయాల్లో  నామినేషన్ ఏర్పాట్లను  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడారు.సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం,  గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో  ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే  ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు.  నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ  తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 147 మంది  రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు.
ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు.  ఒక వ్యక్తి  గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా  తేదీ, సమయం, క్రమ సంఖ్య  నమోదు చేయాలని సూచించారు.  నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని  తెలిపారు. 
 జిల్లాలో మొదటి విడతలో160 గ్రామపంచాయతీలలో 1402 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్ డెస్క్ లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించామని వివరించారు.ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో  ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, జోనల్, మండల ఆఫీసర్లు, ఎంసీసీ నోడల్ ఆఫీసర్లు, ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను నియమించి శిక్షణ పూర్తి చేశామని పేర్కొన్నారు.ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను విధులునిర్వర్తిస్తున్నాయని తెలిపారు.అన్ని ఆర్ఓ కార్యాలయాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని,ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారంఅందుబాటులో పెట్టాలని, నామినేషన్ల స్వీకరణ ఇతర వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో మొదటి రెండు, మూడో విడతలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise