లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వీఆర్వో.

On
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వీఆర్వో.

 

-40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విఆర్ఓ అశోక్ కుమార్.

పత్తికొండ డిసెంబర్ 01(నమస్తే భారత్):- దేవనకొండ మండలం నల్ల చెలిమల వీఆర్వో అశోక్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.చందోలి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ శివకుమార్ తన తల్లి పేరు మీద ఉన్న వారసత్వ భూమిని తన పేరు మీద చేసుకునేందుకు వీఆర్వో అశోక్ కుమార్ ను ఆశ్రయించగా 40 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా,తాను అంత ఇవ్వలేను తగ్గించుకొని చెప్పండి అని బ్రతిమలాడినా వీఆర్వో అశోక్ 40 వేలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పడంతో బాధితుడు శివకుమార్ ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు.కర్నూలు ఏసీబీ డి.ఎస్.పి సోమన్న నేతృత్వంలో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం కాపు కాచి,సోమవారం నాలుగు స్తంభాల మండపం దగ్గర ఉన్న మౌరిన్ నెట్ సెంటర్ షాపులో 40 వేలు లంచం తీసుకుంటుండగా విఆర్ఓ అశోక్ కుమార్,మధ్యవర్తి జయరాముడును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతామని ఏసీబీ డీఎస్పీ సోమన్న విలేకరులకు తెలిపారు.

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise