ఫరూక్‌నగర్‌లో విస్తృత కార్డెన్ సెర్చ్ తనిఖీలు
శాంతి భద్రతలకు ... ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పవు
కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న శంషాబాద్ డీసీపీ రాజేష్ కుమార్, ఏసిపి లక్ష్మీనారాయణ
నమస్తే భరత్,శంషాబాద్ డీసీపీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్ నేతృత్వంలో శుక్రవారం ఫరూక్‌నగర్ పరిధిలో విస్తృత కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రాంతంలో భద్రతా పరిస్థితులను బలోపేతం చేయడం, నేర కార్యకలాపాలను అరికట్టడం, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం లక్ష్యంగా పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టారు.ఆపరేషన్‌లో భాగంగా ముఖ్యంగా అనుమానాస్పద ఇళ్లు, అద్దె గృహాలు, శివారు ప్రాంతాలు, వాహనాలు, లాడ్జిలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వాహనాలు, వ్యక్తుల వివరాలను సేకరించి డాక్యుమెంట్లు పరిశీలించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందిన ప్రదేశాల్లో ప్రత్యేక టీమ్‌లతో సమగ్ర సోదాలు నిర్వహించారు
